




Best Web Hosting Provider In India 2024

వైరల్ గా జన నాయకన్ ఫస్ట్ రోర్.. ఇలాంటి తమిళ్ పోలీస్ థ్రిల్లర్లు కావాలా? ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి
జననాయకన్ సినిమాలో విజయ్ దళపతి పోలీస్ పాత్రలో నటించడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఇది విజయ్ లాస్ట్ సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ రోర్ వైరల్ గా మారింది. అయితే తమిళంలో ఇంతకుముందు వచ్చిన కొన్ని పోలీసు సినిమాలు ఐకానిక్ గా నిలిచిపోయాయి. అవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.
నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి జననాయకన్ సినిమా చేస్తున్నారు. ఈ స్టార్ హీరోకు ఇదే లాస్ట్ సినిమా. పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి వచ్చిన విజయ్.. సినిమాకు దూరంగా ఉంటానని గతంలోనే ప్రకటించారు. జన నాయకన్ సినిమాతో గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి వైరల్ అవుతున్నాయి. అయితే జన నాయకన్ విడుదలకు ముందు, ఈ ఐదు తమిళ పోలీస్ డ్రామాలను ఓటీటీలో చూసేయండి.
వెట్టైయాడు విలయాడు
కమల్ హాసన్ నటించిన వెట్టైయాడు విలయాడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2006లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. యువతి హత్యలను ఛేదించే సీనియర్ పోలీస్ అధికారి కథ ఇది. కమల్ హాసన్ డిసిపి రాఘవన్ పాత్ర ఇప్పటికీ అద్భుతమైనదిగా గుర్తుంచుకుంటారు. యాక్షన్, డ్రామా, రొమాన్స్ కలగలసిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జ్యోతిక, కమలీనీ ముఖర్జీ, డేనియల్ బాలాజీ తదితరులు నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
సింగం
తమిళం పోలీసు సినిమాలు అంటే కచ్చితంగా సూర్య నటించిన సింగం ఫ్రాంఛైజీ గుర్తుకొస్తుంది. తెలుగులోనూ ఈ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. నరసింహంగా సూర్య యాక్షన్ వేరే లెవల్. హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూర్యను మాస్ హీరోగా నిలబెట్టింది. హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్స్ వచ్చాయి. సూర్యతో పాటు అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, వివేక్ తదితరులు నటించారు. జియోహాట్స్టార్ ఓటీటీలో ఉంది.
నేంజుకు నీధి
ఉదయనిధి స్టాలిన్ నటించిన ఈ చిత్రం హిందీ చిత్రం ఆర్టికల్ 15 రీమేక్. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కుల వివక్ష ఆధారంగా జరిగే అత్యాచారాలు, లింగ అపరాధాల గురించి చూపుతుంది. ఒక పోలీస్ అధికారి అంటరానితనం ఇంకా ప్రాబల్యంలో ఉన్న ఊరికి వెళ్లి, మూడు దళిత బాలికలు మిస్సింగ్ అవడంతో అత్యంత దారుణాలను ఎదుర్కొంటాడు. ఈ సినిమా సోనీ లివ్ లో ఉంది.
సేతుపతి
విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. అనుమానంపై అదుపులో ఉన్న వ్యక్తి గాయపడటంతో చెడు పేరు పొందిన పోలీస్ అధికారి కథ ఇది. రేమ్యా నంబీసన్, వేలా రామమూర్తి, మైమ్ గోపి, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు. జీ5 ఓటీటీలో చూడొచ్చు ఈ మూవీ.
దీరన్ అధికారం ఒండ్రు/ఖాకీ
తమిళనాడు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ బావరియా ఆధారంగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. సత్తూరంగ వెట్టై తర్వాత హెచ్ వినోత్, కార్తితో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆకర్షణీయమైన కథనం, నటనకు ప్రశంసలు పొందింది. కార్తి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. కానీ జననాయకన్ తో బిజీగా ఉన్న హెచ్ వినోత్ రెండవ భాగాన్ని ప్రారంభించడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, మనోబాలా తదితరులు నటించారు. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం