డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నటుడు శ్రీరామ్.. పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో

Best Web Hosting Provider In India 2024

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నటుడు శ్రీరామ్.. పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో

Hari Prasad S HT Telugu

తెలుగు ప్రేక్షకులకు శ్రీరామ్‌గా పరిచయమైన తమిళ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఏఐడీఎంకే నేత ఒకరు చెప్పిన సమాచారంతో పోలీసులు శ్రీరామ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు సమాచారం.

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నటుడు శ్రీరామ్.. పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో

తమిళ, తెలుగు నటుడు శ్రీకాంత్ తెలుసు కదా. తెలుగులో శ్రీరామ్ గా సుపరిచితుడు. అతడు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. పోలీసులు విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏషియానెట్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం, బార్‌లో గొడవ, డ్రగ్స్ కేసులో అరెస్టయిన మాజీ ఏఐఏడీఎంకే సభ్యుడు ఒకరు శ్రీకాంత్ పేరు చెప్పినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో శ్రీకాంత్‌

నుంగంబాక్కంలోని ఒక బార్‌లో జరిగిన గొడవ అనంతరం, మాజీ ఏఐఏడీఎంకే సభ్యుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నటుడు శ్రీకాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని సమాచారం.

కోకైన్‌తో పాటు ఇతర డ్రగ్స్‌ను కూడా శ్రీకాంత్‌కు సరఫరా చేసినట్లు ప్రసాద్ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూస్18 తమిళం రిపోర్ట్ ప్రకారం, శ్రీకాంత్ రూ. 12,000కు ఒక గ్రాము కోకైన్ కొనుగోలు చేశాడా లేదా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాంత్ రక్త నమూనాల సేకరణ

ఈ వివరాల ఆధారంగా పోలీసులు సోమవారం (జూన్ 23) శ్రీకాంత్‌ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నుంగంబాక్కంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీస్ బృందం, శ్రీకాంత్ నుండి రక్త నమూనాలను సేకరించి డ్రగ్స్ పరీక్షల కోసం పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి.

పరీక్ష ఫలితాలను బట్టి నటుడిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసులో మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నటుడిపై కేసు నమోదు కాలేదని నివేదిక పేర్కొంది.

ఎవరీ శ్రీరామ్?

శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ 2000ల ప్రారంభంలో తమిళ, తెలుగు చిత్రాలలో నటనకు బాగా పేరుపొందాడు. టాలీవుడ్ లో అతడు శ్రీరామ్ గా పరిచయమయ్యాడు. 2003లో వచ్చిన ఒకరికి ఒకరు సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పిండం, లైలాంటి సినిమాల్లోనూ నటించాడు.

మోడల్‌గా పనిచేసిన తర్వాత, 1999లో కె. బాలచందర్ టీవీ షో ‘జన్నల్ – మరబు కవితైగల్’ ద్వారా నటనా రంగ ప్రవేశం చేశాడు. 2002లో తమిళ చిత్రం ‘రోజా కూటం’తో వెండితెరపైకి అడుగుపెట్టాడు. అప్పటి నుండి, అతను ‘మనసెల్లం’, ‘వర్ణజాలం’, ‘కానా కండేన్’, ‘ఒరు నాల్ కనవు’, ‘బంబర కన్నాలే’, ‘మెర్క్యురీ పూక్కల్’, ‘ఈస్ట్ కోస్ట్ రోడ్’, ‘పూ’, ‘షతురంగం’, ‘నన్బన్’ వంటి చిత్రాలలో నటించాడు. ఇటీవల శ్రీకాంత్ తమిళ చిత్రం ‘కొంజం కాదల్ కొంజం మోదల్’, తెలుగు చిత్రం ‘ఎర్రచీర’, జియోహోట్‌స్టార్ వెబ్ సిరీస్ ‘హరికథ’లో కనిపించాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024