


Best Web Hosting Provider In India 2024

ఫ్యాటీ లివర్‌తో హృతిక్ రోషన్ సోదరి సునయన పోరాటం.. ఎలా తగ్గిందంటే
ఓ ఇంటర్వ్యూలో సునయన తన ఫ్యాటీ లివర్‌ను ఎలా తగ్గించుకుందో, తన లివర్‌కు ఏదో తేడా ఉందని ఆమెకు మొదటగా ఎలా తెలిసిందో చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చెల్లెలు సునయన రోషన్ తన ఫ్యాటీ లివర్ సమస్య గురించి, ఇతర అనారోగ్య సమస్యల గురించి ఎప్పుడూ దాచుకోకుండా మాట్లాడతారు. 2007లో ఆమెకు చాలా అరుదైన గర్భాశయ, లింఫోమా క్యాన్సర్లు ఉన్నాయని కూడా తేలింది. తాజాగా, సెలబ్రిటీ డైటీషియన్ ర్యాన్ ఫెర్నాండోతో ఓ ఇంటర్వ్యూలో సునయన తన ఫ్యాటీ లివర్‌ను ఎలా తగ్గించుకుందో, తన లివర్‌కు ఏదో తేడా ఉందని ఆమెకు మొదటగా ఎలా తెలిసిందో చెప్పారు.
ఫ్యాటీ లివర్ అని ఎప్పుడు తెలిసింది?
తన ఒంట్లో ఏదో తేడా ఉందని మొదట ఎలా గుర్తించారు అని అడిగినప్పుడు, సునయన తనకు పచ్చకామెర్లు వచ్చాయని చెప్పారు. “పచ్చకామెర్లు రాకముందే ఓ వారం రోజుల ముందు నా సోడియం లెవెల్స్ పడిపోయాయి. నాకు సెలైన్ పెట్టారు” అని ఆమె అన్నారు. ఫ్యాటీ లివర్ అని తెలిసినప్పుడు, ఆరోగ్యం పట్ల తాను చాలా నిర్లక్ష్యంగా ఉన్నానని, నచ్చినట్లు చేశానని సునయిన ఒప్పుకున్నారు. “అప్పుడు కూడా నేను వ్యాయామం చేయలేదు. జంక్ ఫుడ్ తినడం ఆపలేదు… నాకు ఎలాంటి భయం లేదు. పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు నాకు కావాల్సిందల్లా ప్రతిరోజూ జంక్ ఫుడ్ మాత్రమే” అని ఆమె వివరించారు.
ఫ్యాటీ లివర్‌ను తగ్గించుకోవడం ఎలా?
ర్యాన్ ఫెర్నాండో చెప్పినట్లుగా పోషకాహారం తీసుకోవడం, లివర్‌కు హాని చేసే ఆహారాలకు దూరంగా ఉండటం, అలాగే కెమోమిల్, డాండెలైన్, నెటిల్ టీ వంటి డిటాక్స్ టీలు తాగడం వల్ల తన ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కి తగ్గిందని సునయన చెప్పారు. ఆ తర్వాత, ఆమె గట్ రీసెట్ పద్ధతిని పాటించి, ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా దూరం చేసుకున్నారు.
తన ఫ్యాటీ లివర్ తగ్గిపోయిందని అల్ట్రాసౌండ్ టెస్ట్ చూపిందా అని అడిగినప్పుడు సునయన “ఇప్పుడు అసలు లేదు… పోయిన సంవత్సరం, నేను కొన్ని టెస్టులు చేయించుకుంటే, నా SGPT, SGOT (లివర్ ఎంత డ్యామేజ్ అయిందో తెలిపే రక్త పరీక్షలు) ఎక్కువగా వచ్చాయి. నా డాక్టర్ సోనోగ్రఫీ చేయించుకోమని సూచించారు. నేను వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టాను కాబట్టి, నాకు ఫ్యాటీ లివర్ ఉందని పూర్తిగా మర్చిపోయాను” అని అన్నారు.
అయితే టెస్టుల రిపోర్టులు వచ్చాక, ఏడాది పాటు ఆరోగ్యంగా తినడం, వ్యాయామం చేయడం వల్ల తన ఫ్యాటీ లివర్ తగ్గిపోయిందని డాక్టర్ శుభవార్త చెప్పారు. “ఆ రోజు, నేను తట్టుకోలేక ఏడ్చాను. ఫ్యాటీ లివర్‌ను తగ్గించుకోవడం, నా శరీరంలో లోపల ఇంత మార్పు రావడం నాకొక గొప్ప విజయం” అని ఆమె ఎమోషనల్ అయ్యారు.
(గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసమే. వైద్య సలహాగా దీన్ని తీసుకోవద్దు. ఆరోగ్య సమస్యల గురించి ఏమైనా సందేహాలు ఉంటే మీ డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించండి.)
టాపిక్