గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతికి మీనా రివర్స్ వార్నింగ్- భర్తకు సలహా- బాలును రెచ్చగొట్టేలా శోభన స్కెచ్!

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతికి మీనా రివర్స్ వార్నింగ్- భర్తకు సలహా- బాలును రెచ్చగొట్టేలా శోభన స్కెచ్!

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు జూన్ 24 ఎపిసోడ్‌లో శ్రుతి నల్లపూసల కార్యక్రమానికి బాలును రావొద్దని శ్రుతి తల్లి శోభన చెప్పిందని ప్రభావతి అంటుంది. ఇంట్లో చాలా సేపు డిస్కషన్ తర్వాత బాలు వస్తాడని అంతా అంటారు. దాంతో మీనాకు ప్రభావతి వార్నింగ్ ఇస్తే తాను రుద్రకాళిని అవుతానని రివర్స్ వార్నింగ్ ఇస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 24 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి నల్లపూసల ఫంక్షన్‌కు బాలు రాకూడదని చెప్పారని సత్యంతో ప్రభావతి చెబుతుంది. వస్తే ఏం అవుతుందట. వాళ్లు తండ్రి నా రిటైర్‌మెంట్ రోజు ఎంతగా అవమానించారో మర్చిపోయారా. అదంతా అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మనం బంధువులం అయ్యాం అని సత్యం అంటాడు.

ఎంత అవమానించారు

మనమందరం వెళ్దాం. కానీ, బాలు ఒక్కడు వద్దని ప్రభావతి అంటుంది. ఆ మాటలు విన్న మీనా ఎక్కడికి అని సత్యంను అడుగుతుంది. ప్రభావతి చెప్పింది సత్యం చెబుతాడు. మౌనిక ఫంక్షన్‌లో ఎంత అవమానించారు. మా ఆయన ఏమైనా గొడవ పడ్డారా. ఎప్పుడు కాలు దువ్వడమే ఆయన పనా. కన్నతల్లిలా మాట్లాడమని చెప్పండి మావయ్య అని సపోర్ట్ చేస్తుంది మీనా.

మీ తమ్ముడి చేయి కూడా విరగగొట్టాడు. నాకు చెబుతున్నావా. అక్కడ ఏదైనా చేస్తే వాళ్ల పరువు, మన పరువు పోతుందని ప్రభావతి అంటుంది. ఇంతలో బాలు వచ్చి ఏంటని అడిగితే మీనా చెబుతుంది. సరే బాలు రాడు అని సత్యం అంటాడు. దాంతో ప్రభావతి సంతోషిస్తుంది. బాలు కూడా రానని అంటాడు. మనోజ్ వాళ్లు వచ్చి వీడు వస్తే సభ్యత లేకుండా ప్రవర్తిస్తాడు అని మనోజ్ అంటాడు.

సభ్యత అంటే లక్షలు మింగడమా, గర్ల్‌ఫ్రెండ్‌కు నాన్న డబ్బు ఇవ్వడమా, పార్కుల్లో తిరగడమా, భార్యకు పావు కిలో హల్వా కొనివ్వకుండా పక్కవాళ్లది మింగడమా అని బాలు అంటాడు. నిన్ను రావొద్దని మీ నాన్న అన్నారుగా ఇంకేంటీ అని ప్రభావతి అంటాడు. అవును, వాన్ని వద్దన్న చోటుకు వాడెలా వస్తాడు. వాన్ని రావొద్దన్న చోటుకు నేనెలా వస్తాను. నేను రాను అని సత్యం అంటాడు.

సిగ్గులేకుండా

నేను మాత్రం సిగ్గులేకుండా వెళ్తాను. నేను కూడా రాను అని మీనా అంటుంది. అదంతా విన్న రవి, శ్రతి ఎక్కడికి అని అడుగుతారు. మీనా చెబుతుంది. మీ ఫంక్షన్‌కు మేము రాము, మీనా, బాలు రాదు అని సత్యం అంటాడు. బాలు గొడవల గురించి రోహిణి అంటుంది. సంజును కొట్టడం తప్పేం కాదు. కావాలంటే మా అమ్మతో నేను మాట్లాడుతాను శ్రుతి అంటుంది.

పిల్లలకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. వెళితే అందరం వెళ్దాం. లేకుంటా రవి, శ్రుతి వెళ్తారు అని సత్యం అంటాడు. అందరు వస్తున్నారు. ఏం సమస్య లేదు ఆంటీ అని శ్రుతి అంటుంది. దాంతో బాలు వస్తున్నాడని శోభనకు కాల్ చేసి చెబుతుంది ప్రభావతి. బాలు అక్కడ నోరు మెదపకుండా చూసే బాధ్యత నాది అని ప్రభావతి అంటుంది.

మా గౌరవానికి భంగం కలగకూడదు అంతే అని శోభన అని కాల్ కట్ చేసి నవ్వుతుంది. సురేంద్ర వచ్చి ఏంటని అడుగుతుంది. ప్రభావతి ఆశకు గాలం వస్తే ఇట్టే బుట్టలో పడుతుంది. దాన్ని వాడుకుంటున్నా. బాలు రాకపోవడం గురించి వాళ్ల ఇంట్లో పెద్ద డిస్కషన్ జరిగిందట. బాలు కూడా ఫంక్షన్‌కి కూడా వస్తాడు. వాడు వచ్చి తీరాలి. అలా అయితేనే మనం అనుకున్నట్లు గొడవ చేస్తాడు. దాంతో మీలాంటి వాళ్ల ఇంట్లో నా కూతురును ఉంచలేం అని చెబుతాం అని శోభన అంటుంది.

శోభన కన్నింగ్ ప్లాన్

వాడికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. వాడిని రెచ్చగొడతాను. వాడిని ఎలా రెచ్చగొట్టాలో కూడా ప్లాన్ చేసుకున్నా. మీరే చూడండి అని తన కన్నింగ్ ప్లాన్ చెబుతుంది శోభన. రాత్రిపూట మీనా దగ్గరికి వెళ్లిన ప్రభావతి మనోజ్ లాంటి వాడు వస్తే నేల మీద ఉండేదానివి కాదేమో అంటుంది. డిగ్రీలు ఉండి మా ఆయన పల్లీలు తినట్లేదు. మీరు దగ్గర పెట్టుకుని చదివించి ఉంటే ఆయనకు కూడా డిగ్రీలు ఉండేవి. మీరెప్పుడు మా ఆయనకు అన్యాయమే చేశారు అని మీనా అంటుంది.

బాలు అక్కడికి వచ్చి గొడవ చేయకూడదు అని ప్రభావతి అంటే మీనా సెటైర్లు వేస్తుంది. వాడు ఏదైనా గొడవ చేస్తే నేను భద్రకాళి అవుతా అని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటారు. నా భర్తను అవమానిస్తే నేను రుద్రకాళి అవుతాను. ఆ ఇటుకను కూడా కారులో వేసుకుని వస్తాను అని మీనా రివర్స్ వార్నింగ్ ఇస్తుంది. దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది.

తర్వాత బాలు దగ్గరికి మీనా వెళ్లి ఫంక్షన్‌లో మీరు ఎలాంటి గొడవ చేయకూడదు. మీరు కాస్తా తొందరపడకండి. మనం ఏం మాట్లాడకుండా ఉందామంటున్నా. అక్కడ గొడవ జరిగితే మావయ్య గారే పరువు పోతుంది అని సలహా ఇస్తుంది. సరే నేను నోరు మెదపను చూస్తూ ఉంటాను. కానీ, నీ గురించి, నాన్న గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను ముందే చెబుతున్నాను అని బాలు అంటాడు.

లక్షకుపైగా కావాలి

మరోవైపు ఫంక్షన్ గురించి, ముందు తన తాళి మార్చడం గురించి రోహిణి తన ఫ్రెండ్‌కు చెబుతుంది. డబ్బు అడుగుతుంది. తన దగ్గర లేకపోవడంతో తల్లికి కాల్ చేస్తుంది రోహిణి. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా. లక్షకుపైగా కావాలి. దానికే డబ్బు అవసరం పడింది అని రోహిణి అడుగుతుంది. అంత డబ్బు లేదు. ఇంట్లో నగ ఉంది. అది తాకట్టు పెట్టు. నేను డబ్బు తీసుకొస్తాను. నిన్ను చూసినట్లు అంటుంది అని రోహిణి తల్లి అంటుంది.

మీ అమ్మను డబ్బు అడుగుతావేంటీ. మనవడిని పెంచుతుంది. ఇది అదనపు బారం అని ఫ్రెండ్ అంటుంది. ముందు ఈ టెన్షన్ నుంచి బయటపడటమే ఇంపార్టెంట్. వచ్చే నెల జీతం నుంచి ఇంటికి పంపిస్తాను. మా నాన్న విషయం డైవర్ట్ కావాలంటే ఇంకా ఏదైనా పెద్ద ఇష్యూ చేయాలి అని రోహిణి ప్లాన్ వేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024