కుబేర 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఇండియాలో రూ.60 కోట్ల మార్క్ దాటిన ధనుష్, నాగార్జున మూవీ

Best Web Hosting Provider In India 2024

కుబేర 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఇండియాలో రూ.60 కోట్ల మార్క్ దాటిన ధనుష్, నాగార్జున మూవీ

Hari Prasad S HT Telugu

కుబేర మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు దుమ్ము రేపుతూనే ఉన్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా ఐదు రోజుల్లో ఇండియా కలెక్షన్లు రూ.60 కోట్లు దాటడం విశేషం. తొలి మంగళవారం ఈ సినిమా మంచి వసూళ్లే సాధించింది.

కుబేర 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఇండియాలో రూ.60 కోట్ల మార్క్ దాటిన ధనుష్, నాగార్జున మూవీ

కుబేర మూవీ బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఫస్ట్ వీకెండ్ ను రికార్డు కలెక్షన్లతో ముగించిన ఈ సినిమా.. తొలి సోమ, మంగళవారాల్లోనూ మంచి వసూళ్లే రాబట్టింది. ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు తగ్గడం లేదు. తాజాగా ఐదో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూడండి.

కుబేర బాక్సాఫీస్ కలెక్షన్లు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున, జిమ్ సర్భా ప్రధాన పాత్రల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘కుబేర‘. గత శుక్రవారం (జూన్ 20) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా ధనుష్ నటనకు ప్రశంసలు దక్కాయి. Sacnilk.com తాజా రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇప్పుడు ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ రిపోర్టు ప్రకారం ‘కుబేర’ తన మొదటి మంగళవారం రూ.3.66 కోట్లు (అన్ని భాషలలో) వసూలు చేసింది. శుక్రవారం నాడు అదిరిపోయే ఓపెనింగ్‌తో రూ.14.75 కోట్లు సాధించిన సినిమా.. శనివారం 11.86% వృద్ధితో రూ.16.5 కోట్లు, ఆదివారం రూ.17.35 కోట్లు వసూలు చేసింది. సోమవారం వసూళ్లు తగ్గినా రూ.6.8 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో, సినిమా మొత్తం వసూళ్లు ఇప్పుడు రూ.59.06 కోట్లకు చేరాయి.

ఇది కేవలం ఇండియా నెట్ వసూళ్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ చూసుకుంటే.. రూ.90 కోట్లు దాటాయి. మంగళవారం నాడు ‘కుబేర’ తెలుగు ఆక్యుపెన్సీ 25.88 శాతంగా నమోదైంది. ఉదయం షోలకు 17.31 శాతం, మధ్యాహ్నం షోలకు 28.12 శాతం ఆక్యుపెన్సీ ఉంది. సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీ 32.21 శాతానికి పెరిగింది.

‘కుబేర’ సినిమా గురించి

‘కుబేర’ మూవీ దేవ (ధనుష్) అనే బిచ్చగాడి కథ. అతను మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున), అవినీతిపరుడైన సీఈఓ నీరజ్ (జిమ్), ముంబైలో చిక్కుకున్న సమీరా (రష్మిక)లను కలుసుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారుతుంది అనేది కథాంశం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీనిని తీశారు.

హైదరాబాద్‌లో జరిగిన సినిమా సక్సెస్ మీట్‌లో చిరంజీవి ధనుష్ నటనను తెగ పొగిడారు. “దేవా పాత్రను ధనుష్ తప్ప మరెవరూ అంత పర్‌ఫెక్ట్‌గా చేయలేరు. ధనుష్ నిజంగా తన నటనకు జాతీయ అవార్డుకు అర్హుడు. ఒకవేళ అతనికి ఆ అవార్డు రాకపోతే, ఆ అవార్డులకే అర్థం ఉండదు” అని చిరంజీవి అనడం విశేషం. కుబేర ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువైంది. బుధవారం (జూన్ 25) ఈ సినిమా ఆ మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024