





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారు వీడియోతో సీన్ రివర్స్.. ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. దీపకు సారీ చెప్పిన సుమిత్ర
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 25 ఎపిసోడ్ లో దీపపై దొంగతనం కుట్ర మోపిన పారుజాతం ఆమెను బయటకు పంపించాలని అంటుంది. కానీ వీడియోతో పారుకు షాకిస్తాడు కార్తీక్. దీపకు పారుతో పాటు సుమిత్ర కూడాా సారీ చెప్తుంది. ఇంకా ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్ లో చూసేయండి.
కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో తన వజ్రాల దుద్దుల్లో ఒక బుట్ట దొంగతనం జరిగిందని, దీప తీసిందని పారిజాతం ఆరోపిస్తుంది. కిచెన్ లోకి సుమిత్ర, పారు వెళ్లి వెతుకుతారు. ఓ ర్యాకులో నుంచి ఆ చెవి దుద్దును పారు బయటకు తీసి సుమిత్రకు చూపిస్తుంది. రేయ్ కార్తీక్ చూడు.. నా వజ్రాల బుట్టను మీ ఆవిడే దొంగతనం చేసిందని పారు అంటుంది. మూడోసారి నింద నిజం కావొచ్చు కదా అని పారు అంటుంది. దీప దొరికిపోయిందిగా అని జ్యోత్స్న అంటుంది.
దీప షాక్
ఆ వజ్రాల దుద్దు నా పర్సులో దొరకడం ఏంటీ అని దీప కంగారు పడుతుంది. ఈ వజ్రాల బుట్ట నీ పర్సులోనే ఉంది? కావాలని పెట్టినట్లుంది అని సుమిత్ర అంటుంది. నువ్వు దొంగతనం చేశావని అన్నారు, నేను నమ్ముతున్నా అని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. దీప తీయలేదని అంటుంది కదా అని దశరథ్ అంటే.. అందరూ దీపనే దొంగగా చూస్తారు. దొంగకు ఈ ఇంట్లో చోటు లేదు పంపేయండి అని జ్యో అంటుంది.
ఈ ఇంట్లో దొంగలకు చోటు లేదు, కానీ దొంగలెవరో తేలలేదు అని కార్తీక్ ఏదో ప్లాన్ వేస్తాడు. ఇది ఒరిజినలేనా అని డౌట్ పడతాడు కార్తీక్. వెంటనే పారు మొత్తం వజ్రాల సెట్టే దొంగతనం చేశారు అంటూ అరుచుకుంటూ వస్తుంది. వజ్రాల నగల సెట్టు ఎక్కడా అని దీపను అడుగుతుంది పారు. కిచెన్ లో వెతుకుదామని కార్తీక్ తీసుకెళ్తాడు.
వీడియోతో దొరికిన దొంగ
కిచెన్ లో పారు వెతుకుతుంటే, కార్తీక్ ఫోన్ చూస్తూ ఉంటాడు. నా కూతురు రీల్ చూడమంటూ పారును ఏడిపిస్తాడు కార్తీక్. పారూనే ఆ వజ్రపు బుట్ట తెచ్చి దీప పర్సులో వేసిన వీడియోను కార్తీక్ చూపిస్తాడు. వంట గదిలో సీసీ కెమెరా పెట్టా అని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు. ఈ వీడియోను శివన్నారాయణకు చూపించామనుకో అని కార్తీక్ అనగానే పారుకు చెమటలు పడతాయి. శివన్నారాయణ తనను బయటకు నెట్టేయడంపై పారు ఊహలో అనుకుని భయపడుతుంది.
టంకరి దొంగ
బాక్సులో ఉన్న నగలను తానే తీశానని కార్తీక్ చెప్తాడు. నువ్వు గజదొంగవి అయితే నేను టంకరి దొంగ అని హీరో లెవల్లో అంటాడు కార్తీక్. నేను దొంగతనం చేశానంటే ఈ ఇంట్లో ఎవరూ నమ్మరు అని పారుతో ఆడుకుంటాడు కార్తీక్. ఈ వీడియో కూడా చూపించి పారు కావాలనే మా మీద నిందలు వేస్తుంది అని అంటాను, తాత గెంటిస్తే బయటకు వెళ్లిపోతావు అని కార్తీక్ భయపెడతాడు. దీప నిర్దోషి, నేనే పొరపడ్డాను అని అందరికీ చెప్పాలని పారుకు కండీషన్ పెడతాడు కార్తీక్.
నిజం చెప్పడంతో
మీరు ఇద్దరు తోడు దొంగలు అని పారు, జ్యోత్స్న గురించి ఉద్దేశిస్తూ కార్తీక్ అంటాడు. నేను చెప్పినట్లు చేయకపోతే వీడియో బయట పెట్టేస్తానంటాడు. వీడియో చూపిస్తాను అనగానే పారు అసలు విషయం చెప్తుంది. శివన్నారాయణ కోపంతో పారును అడుగుతాడు. దీప దొంగతనం చేయలేదండీ అని పారు అనగానే.. ఈ సారి జ్యోత్స్నకు షాక్ తగులుతుంది. మరి నీ వజ్రాల బుట్ట దీప పర్సులో ఎలా దొరికింది? అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు.
ఆ నగలు డిజైనర్ కు ఇద్దామనుకున్నా కానీ వజ్రాల బుట్ట మిస్ అయింది. కిచెన్ లోకి వెళ్లినప్పుడు ఫొన్లో మాట్లాడుతూ అక్కడ పెట్టేశాను. తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయా. తర్వాత చూస్తే ఆ వజ్రాల బుట్ట లేదు. దీప తీసి ఉంటుంది అని అలా అన్నాను. వీటిలో ఎవరి తప్పు లేదు. నా మతిమరపే అందుకు కారణం. రెండు చెంపలు వాయిస్తా అని శివన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సారీ చెప్పిన పారు
తప్పులు ఎవరు చేసినా శిక్ష ఒకటే, నీ మతి మరుపు వల్ల దీపపై నింద పడింది కాబట్టి సారీ చెప్పు అని పారుతో అంటాడు శివన్నారాయణ. సారీ దీప అని పారు చెప్తుంది. దీప, కార్తీక్ ఎలాంటివాళ్లో అందరికీ తెలుసు, వాళ్లను నిందించి నీ విలువ తగ్గించుకోకు పిన్ని అని పారుతో దశరథ్ అంటాడు. వయసుకు ఉన్న మర్యాదను కాపాడుకోండి అత్తయ్య, ఈ దీప ఎన్నోసార్లు తప్పు చేసింది నేనూ నిందించా అని సుమిత్ర అంటుంది. తాను ఏ తప్పూ చేయకుండానే నేనో మాట అన్నానంటే నేను తప్పు చేసినట్లే ఒప్పుకొంటా. వెంటనే క్షమాపణ చెప్తాను.
క్షమించమన్న సుమిత్ర
దీప నిన్ను ఒక మాట అని తప్పు చేశాను. కుదిరితే నన్ను క్షమించు అని సుమిత్ర అంటే.. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అమ్మా అని దీప అంటుంది.నువ్వు ఏమైనా నా కన్న కూతురివా అని సుమిత్ర అనగానే.. అవును మమ్మీ దీపే నీ కన్న కూతురు అని జ్యో మనసులో అనుకుంటుంది. నేనేమైనా నీ కన్న తల్లినా అని సుమిత్ర అంటే.. అవును నువ్వు దీప కన్న తల్లివే అని మనసులో అనుకుంటాడు కార్తీక్. మనకు రక్త బంధం లేదు అని సుమిత్ర అంటుంది. ఏ బంధం లేకుండానే ఇంట్లో ఉంటుందా? అని కార్తీక్ ప్రశ్నిస్తే అది తనకే తెలియాలని సుమిత్ర అంటుంది. చంపాలనుకునే మనిషికి, తప్పించుకున్న మనిషికి ఉన్న బంధమే ఉంది, వీలైతే క్షమించు దీప అని సుమిత్ర వెళ్లిపోతుంది.
32వ తారీఖు
పెద్ద మేడం సైలెంట్ గా వెళ్లిపోతున్నారు అని జ్యోతో అంటాడు కార్తీక్. పని ఉంది అంటూ వెళ్లిపోతుంది జ్యో. ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పమని కార్తీక్ ను ప్రాధేయపడుతుంది పారు. నీ మనసు మంచిగా ఉన్నప్పుడు ఇస్తా అని కార్తీక్ ఆడుకుంటాడు పారుతో. రూ.30 లక్షల నగలు ఇచ్చేయ్ రా అని పారు బతిమిలాడుతుంది. ఈ నెల 32వ తారీఖున నీ నగలు నీ బీరువాలో ఉంటాయని కార్తీక్ అంటే.. ఓకే అని పారు అంటుంది. ఆ తర్వాత నెలలో 32వ తారీఖు ఉండదు కదా అని పారు సర్వం గోవిందా అని అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్