100 కోట్లు కొల్లగొట్టిన కుబేర మూవీ- ధనుష్ కెరీర్‌లో ఇది నాలుగోసారి- మిగతా 3 ఇవే! హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Best Web Hosting Provider In India 2024

100 కోట్లు కొల్లగొట్టిన కుబేర మూవీ- ధనుష్ కెరీర్‌లో ఇది నాలుగోసారి- మిగతా 3 ఇవే! హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

Sanjiv Kumar HT Telugu

హీరో ధనుష్ బిచ్చగాడు దేవ పాత్రలో నటించిన సినిమా కుబేర. నాగార్జున, రష్మిక మందన్నాతో ధనుష్ కలిసి నటించిన కుబేర ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్లు కొల్లగొట్టింది. అయితే, ధనుష్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం సినీ కెరీర్‌లో ఇది నాలుగో సారి. మరి వంద కోట్లు సాధించిన ధనుష్ మిగతా సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

100 కోట్లు కొల్లగొట్టిన కుబేర మూవీ- ధనుష్ కెరీర్‌లో ఇది నాలుగోసారి- మిగతా 3 ఇవే! హిట్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదలై దూసుకుపోతోంది. తాజాగా కుబేర ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

దేవ అనే బిచ్చగాడిగా ధనుష్

కుబేర వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిందని ఉన్న పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. అయితే, కుబేర సినిమాలో దేవ అనే బిచ్చగాడి పాత్రలో అదరగొట్టిన ధనుష్ తన సినీ కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ సాధించడం ఇది నాలుగోసారి.

ధనుష్ 100 కోట్ల సినిమాలు

మొదటిసారి ధనుష్ 2022లో తిరు మూవీతో వంద కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత 2023లో తెలుగులో చేసిన సార్ సినిమాకు రూ. 100 కోట్లు వచ్చాయి. అనంతరం గతేడాది అంటే 2024లో తన సొంత దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీతో మూడోసారి వంద కోట్ల మైలురాయిని ధనుష్ ఖాతాలో వేసుకున్నాడు.

కుబేర ఆరో రోజు కలెక్షన్స్

ఇక తాజాగా కుబేర సినిమాతో నాలుగోసారి వంద కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన హీరోగా నిలిచాడు ధనుష్. ఇదిలా ఉంటే, కుబేర మూవీకి ఇండియాలో ఐదు రోజుల్లో రూ. 5.85 నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఆరో రోజు రూ. 4 కోట్ల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సక్నిల్క్ తెలిపింది. దీంతో ఆరు రోజుల్లో భారత్‌లో కుబేరకు రూ. 65.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నాయి.

కుబేర బ్రేక్ ఈవెన్ టార్గెట్

ఇక కుబేర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్లు బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 66 కోట్లుగా నమోదు అయింది. దీంతో కుబేర హిట్ కావాలంటే ఇంకా రూ. 10 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. ఇప్పటివరకు కుబేర సినిమాకు బడ్జెట్, బిజినెస్‌లో 77 శాతం రికవరీ అయినట్లు సమాచారం.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024