బిగ్‌ బాస్ ఫ్యాన్స్ అల‌ర్ట్‌.. కొత్త సీజ‌న్ వ‌చ్చేస్తోంది.. హోస్ట్‌గా నాగార్జున వేరే లెవల్ ఎంట్రీ.. ప్రోమో వైర‌ల్‌

Best Web Hosting Provider In India 2024

బిగ్‌ బాస్ ఫ్యాన్స్ అల‌ర్ట్‌.. కొత్త సీజ‌న్ వ‌చ్చేస్తోంది.. హోస్ట్‌గా నాగార్జున వేరే లెవల్ ఎంట్రీ.. ప్రోమో వైర‌ల్‌

బిగ్‌ బాస్ ఫ్యాన్స్ అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు బిగ్‌ బాస్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. కమింగ్ సూన్ అంటూ స్టార్ మా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హోస్ట్ గా నాగ్ ఎంట్రీ అదిరిపోయింది.

త్వరలోనే బిగ్‌ బాస్ కొత్త సీజన్

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. అన్ని రకాల ఎమోషన్స్ ను బయటకు తీసే గేమ్ ప్లేకు టైమ్ ఆసన్నమవుతోంది. సెలబ్రిటీలతో బిగ్ బాస్ ఆడించే ఆట మళ్లీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. కొత్త సీజన్ ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు స్టార్ మా క్లారిటీనిచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసింది.

వైరల్ ప్రోమో

బిగ్ బాస్ సీజన్ 9 కమింగ్ సూన్ అంటూ స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో హాస్ట్ నాగార్జున ఎంట్రీ వేరే లెవల్ లో ఉంది. ఆయన స్వాగ్, స్టైల్ అదిరిపోయింది. ‘‘ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు ప్రభంజనం సృష్టించాలి. ఈ సారి చదరంగం కాదు రణరంగమే’’ అని ప్రోమోలో నాగార్జున చెప్పిన డైలాగ్ విజిల్స్ కొట్టిస్తోంది.

నాగ్ స్వాగ్

బిగ్ బాస్ 9 ప్రోమోలో హోస్ట్ నాగార్జున స్వాగ్ అదిరిపోయింది. స్టైలిస్ ఎంట్రీతో ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నారు. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అంటూ ఆయన చెప్పిన డైలాగ్ తో.. ఈ సీజన్ 9లో టాస్క్ లు బాగానే ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ఈ ప్రోమోతో స్టార్ మా గుడ్ న్యూస్ చెప్పినట్లే. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సీజన్ స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఆ ప్రచారం వట్టిదే

అయితే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ను మారుస్తారనే ప్రచారం కొన్ని రోజులగా గట్టిగా సాగింది. ఫస్ట్ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున వరుసగా హోస్ట్ గా చేస్తూనే వస్తున్నారు. కానీ 9వ సీజన్ కు నాగ్ ప్లేస్ లో వేరే వాళ్లు వస్తారనే టాక్ వినిపించింది. అంతే కాకుండా బాల‌కృష్ణ‌, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు హోస్ట్ గా వస్తారనే రూమర్లు వచ్చాయి. కానీ తాజా ప్రోమోతో అవన్నీ అబద్ధాలని రుజువైంది.

సీజన్ 9లో స్టార్ మా షోలు కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్, కూకు విత్ జాతి రత్నాలు షోలో ఉన్న సెలబ్రిటీల్లో ఎక్కువ మంది కంటెస్టెంట్లుగా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024