





Best Web Hosting Provider In India 2024

ఏది పడితే అది తింటాను కానీ..: తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో చెప్పిన సల్మాన్ ఖాన్.. తన 89 ఏళ్ల తండ్రి గురించి కూడా..
బాలీవుడ్ స్టార్ హీర సల్మాన్ ఖాన్ ఈ మధ్యే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి వెళ్లాడు. అందులో అతడు తనతోపాటు తన 89 ఏళ్ల తండ్రి సలీమ్ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి కూడా వెల్లడించాడు. తాను ఏది పడితే అది తింటానని కూడా ఈ సందర్భంగా చెప్పాడు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన ఫిట్‌నెస్, సరదా మాటలు, ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే తీరుతో ఆకట్టుకుంటాడు. తాజాగా, అతను నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ కొత్త సీజన్ మొదటి ఎపిసోడ్‌లో కనిపించాడు. ఈ షోలో సల్మాన్‌తో పాటు కపిల్ శర్మ, అర్చనా పూరన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్, కికు శారద వంటి ప్రముఖ కమెడియన్లు కూడా ఉన్నారు. సల్మాన్ ఎపిసోడ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రేక్షకులు అతని సరదా సంఘటనలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా బాగా ఇష్టపడుతున్నారు.
తండ్రి సలీం ఖాన్ ఫిట్‌నెస్‌పై సల్మాన్
నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సల్మాన్ ఖాన్ తన తండ్రి సలీం ఖాన్ ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి మాట్లాడాడు. తన తండ్రి, 89 ఏళ్ల సలీం ఖాన్, ఇప్పటికీ ప్రతి ఉదయం బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వరకు వాకింగ్ కు వెళ్తారని సల్మాన్ చెప్పాడు.
సల్మాన్ నవ్వుతూ.. “నాన్నకు ఇప్పుడు ఆకలి తగ్గిందని అంటారు. కానీ నిజం ఏంటంటే ఆయన ఇప్పటికీ రోజుకు రెండు సార్లు 2-3 పరాటాలు, అన్నం, మాంసం, స్వీట్లు తింటారు. ఆయన జీవక్రియ (మెటబాలిజం), క్రమశిక్షణ రెండూ అద్భుతం” అని అన్నాడు. తన తండ్రి జీవనశైలి చూసి తమ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉందని, గర్విస్తోందని సల్మాన్ చెప్పాడు.
సల్మాన్ డైట్ ప్లాన్
సల్మాన్ తన డైట్ గురించి కూడా చెప్పాడు. తాను ఏది పడితే అది తింటానని, కానీ ఎప్పుడూ అతిగా తిననని అన్నాడు. “నేను కేవలం ఒకటి లేదా ఒకటిన్నర చెంచా అన్నం, ఏదైనా కూరగాయ, చికెన్ లేదా మటన్ లేదా చేపలు తింటాను” అని సల్మాన్ చెప్పాడు. తాను ఫిట్‌గా ఉండటానికి ఎప్పుడూ సమతుల ఆహారం, వ్యాయామంపై దృష్టి పెడతానని సల్మాన్ వెల్లడించాడు.
ఈ సంభాషణలోనే బాలీవుడ్‌లో ఫిట్‌నెస్, జిమ్ కల్చర్‌ను పాపులర్ చేయడంలో తాను కీలక పాత్ర పోషించానని సల్మాన్ తెలిపాడు. అతన్ని చూసి ఇండస్ట్రీలోని చాలా మంది నటులు ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారు. ధర్మేంద్ర వంటి సీనియర్ నటులు కూడా ఈ రోజుకీ తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టడం చూసి తనకు చాలా సంతోషంగా ఉంటుందని సల్మాన్ చెప్పాడు.
సల్మాన్ రాబోయే ప్రాజెక్ట్స్
సల్మాన్ చివరి చిత్రం ‘సికందర్‘ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోయినా, సల్మాన్ జోష్ మాత్రం తగ్గలేదు. 2020 గాల్వాన్ లోయ వివాదం ఆధారంగా రూపొందుతున్న వార్ డ్రామాలో అతను త్వరలో కనిపించనున్నాడు.
అంతేకాకుండా, సల్మాన్ ‘భజరంగీ భాయిజాన్ 2’ గురించి కూడా ప్రస్తుతం చర్చిస్తున్నాడు. కబీర్ ఖాన్‌తో కలిసి దీనికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా, సల్మాన్ ఖాన్ ఈ షోలో తన కుటుంబం, ఫిట్‌నెస్, రాబోయే ప్రాజెక్ట్స్ గురించి చాలా నిజాయితీగా మాట్లాడాడు. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సంబంధిత కథనం