మంచు విష్ణు కన్నప్ప మూవీకి పాజిటివ్ టాక్.. ప్రభాస్ నుంచి కాజల్ వరకు ఏ పాత్రను ఏ స్టార్ చేశారు? ఎలా చేశారో ఓ లుక్కేయండి!

Best Web Hosting Provider In India 2024

మంచు విష్ణు కన్నప్ప మూవీకి పాజిటివ్ టాక్.. ప్రభాస్ నుంచి కాజల్ వరకు ఏ పాత్రను ఏ స్టార్ చేశారు? ఎలా చేశారో ఓ లుక్కేయండి!

Sanjiv Kumar HT Telugu

మంచు విష్ణు నటించిన మైథలాజికల్ డివోషనల్ మూవీ కన్నప్ప ఇవాళ (జూన్ 27)న థియేటర్లలో విడుదలైంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, మధుబాల, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి వంటి స్టార్స్ తమ పాత్రల్లో ఎలా నటించారో ఇక్కడ ఓ లుక్కేద్దాం.

మంచు విష్ణు కన్నప్ప మూవీకి పాజిటివ్ టాక్.. ప్రభాస్ నుంచి కాజల్ వరకు ఏ పాత్రను ఏ స్టార్ చేశారు? ఎలా చేశారో ఓ లుక్కేయండి!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య నేడు (జూన్ 27) థియేటర్స్‌లో రిలీజ్ అయింది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు.

స్టార్ నటీనటులు

కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడీగా తమిళ బ్యూటి ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేయగా.. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధుబాల, బ్రహ్మానందం తదితర స్టార్స్ యాక్ట్ చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున కన్నప్ప మూవీని రిలీజ్ చేయగా ప్రీమియర్స్‌ నుంచి మంచి స్పందన రాబట్టింది. ఇక ఇవాళ విడుదలైన కన్నప్ప సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ వస్తోంది. మంచు విష్ణుతోపాటు ఇతర నటీనటుల యాక్టింగ్ చాలా బాగుందని రివ్యూవర్స్ చెబుతున్నారు.

తనదైన డైలాగ్ డెలివరీతో

ముఖ్యంగా తమిళ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో నాథనాధుడి క్యారక్టర్‌లో గంబీరమైన వాయిస్‌తో మెప్పించాడు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మహాదేవ శాస్త్రిగా జీవించేసాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ పాత్రలో నెమలిగా ఒదిగిపోయింది.

ఇక మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెబల్ స్టార్ ప్రభాస్. సినిమాలో కీలకమైన 40 నిముషాల ఎపిసోడ్‌ను ప్రభాస్ నిలబెట్టేసాడు. రుద్రుడిగా ప్రభాస్ డైలాగ్స్ విషయంలో రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ పెన్నుకు పదును పెట్టారు. ప్రభాస్ పెళ్లి డైలాగ్‌కు థియేటర్స్ హోరెత్తాయి. ఇక క్లైమాక్స్‌లో మంచు విష్ణు నటన కెరీర్ బెస్ట్ అనే టాక్ వినిపించింది.

కన్ను దానం చేసే సీన్

కన్నప్ప క్లైమాక్స్ పోర్షన్‌లో మంచు విష్ణు నటన చూసి ఆశ్చర్యపోయినట్లు చాలా మంది రివ్యూవర్స్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. శివయ్యకు తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి తన అద్భుతమైన నటనతో మంచు విష్ణు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు.

కన్నప్ప సాంగ్స్‌తో పాటు నేపథ్య సంగీతం మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవదాసి తన బెస్ట్ ఇచ్చారని టాక్ వస్తోంది. ఇక పార్వతిగా కాజల్ అగర్వాల్ ఎంతో పవిత్రంగా కనిపించింది. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ చాలా బాగా అలరించారు. సెకండాఫ్‌లో శివుడిగా అక్షయ్ కుమార్ లీనమైనట్లు కనిపిస్తారు.

ఒక్కొక్కరి పాత్ర

ఇక కిరాటగా మోహన్ లాల్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని టాక్ వస్తోంది. అలాగే, సీనియర్ హీరోయిన్ మధుబాల పన్నాగగా, కంపడుగా ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ, వీరయ్యగా కరుణాస్, పిలకగా బ్రహ్మానందం, మల్లయ్య పాత్రలో రఘుబాబు, మారెమ్మగా ఐశ్వర్య భాస్కరన్, కుమార దేవ శాస్త్రిగా శివ బాలాజి ఆకట్టుకున్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024