





Best Web Hosting Provider In India 2024

ఈ సినిమాతో విజ్జుని గర్వపడేలా చేస్తుందట.. రష్మిక మందన్నా ఇన్‌స్టా స్టోరీ వైరల్
రష్మిక మందన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండను ముద్దుగా విజ్జు అని పిలుస్తోంది. తాజాగా తన లేటెస్ట్ మూవీ మైసాను ప్రశంసిస్తూ విజయ్ చేసిన పోస్ట్ కు తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా రష్మిక ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న విజయ్ దేవరకొండ ఆమె లేటెస్ట్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ పై స్పందించాడు. అయితే అతని రియాక్షన్ కంటే కూడా దీనికి రష్మిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో ఆమె విజయ్ ని విజ్జు అని పిలవడం విశేషం.
రష్మిక మైసా మూవీ..
నటి రష్మిక మందన్నా తన రాబోయే మూవీ ‘మైసా’లోని తన పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులను ఉత్సాహపరిచింది. శుక్రవారం (జూన్ 27) ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. తన సోషల్ మీడియాలో, రష్మిక తన పాత్రకు సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్‌ను పంచుకుంది.
ఇది ఆమె అభిమానుల్లో అంచనాలను పెంచింది. ఈ సందర్భంగా రష్మిక బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ప్రత్యేక అభినందనలు చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
రష్మిక ‘మైసా’ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసిన విజయ్
విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రష్మిక రాబోయే చిత్రం ‘మైసా’ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “ఇది అద్భుతంగా ఉండబోతోంది” అని రాశాడు. విజయ్ స్టోరీని రష్మిక తిరిగి షేర్ చేస్తూ.. “విజ్జూ.. దీనితో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను” అని క్యాప్షన్ ఇచ్చింది.
రష్మిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది అభిమానులను ఆకర్షించింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా విజయ్ తో తన రిలేషన్షిప్ ను ఇన్‌డైరెక్ట్ గా కన్ఫమ్ చేస్తూనే ఉంది. ఇప్పుడీ పోస్ట్ తో వీళ్ల మధ్య బంధంపై మరింత స్పష్టత వచ్చినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘మైసా’లో రష్మిక ఇంటెన్స్ లుక్
శుక్రవారం (జూన్ 27) ఉదయం రష్మిక తన సోషల్ మీడియాలో తన సినిమా ఫస్ట్‌లుక్‌ను ఒక పెద్ద నోట్‌తో పంచుకుంది. “నేను ఎప్పుడూ మీకు కొత్తగా ఏదో ఒకటి.. భిన్నంగా ఏదో ఒకటి.. ఉత్సాహంగా ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.. ఇది అలాంటి వాటిల్లో ఒకటి. నేను ఇంతకుముందెన్నడూ చేయని పాత్ర.. నేను ఇంతకుముందెన్నడూ ప్రవేశించని ప్రపంచం..
నాలో నేనే ఇప్పటివరకు చూడని ఒక వెర్షన్ ఇది. ఇది భీకరంగా.. తీవ్రంగా, చాలా సహజంగా ఉంటుంది. నేను చాలా టెన్షన్‌గా ఉన్నాను. కానీ చాలా ఉత్సాహంగా ఉన్నాను. మేము ఏం సృష్టించబోతున్నామో మీరు చూడటానికి నిజంగా వేచి ఉండలేను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే..” అని రష్మిక మైసా మూవీ ఫస్ట్ లుక్ షేర్ చేసుకుంది.
రష్మిక, విజయ్ రాబోయే ప్రాజెక్ట్స్
రష్మిక ఈ ఏడాది పలు భారీ ప్రాజెక్టులతో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ మధ్యే ఆమె నటించిన కుబేర రిలీజై బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రష్మికకు ఇంకా ‘థమా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
మరోవైపు, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్-ప్యాక్డ్ తెలుగు స్పై థ్రిల్లర్ ‘కింగ్డమ్’ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందించేందుకు ప్లాన్ చేశారు. ‘కింగ్డమ్’ జులై 4న థియేటర్లలో విడుదల కానుంది.
సంబంధిత కథనం