పోర్న్​ వీడియోల్లో ఆ పని ఎక్కువ సేపు​ ఎలా చేయగలుగుతారు? అంగస్తంభన అంతసేపు ఎలా ఉంటుంది? అసలు నిజాలు..

Best Web Hosting Provider In India 2024

పోర్న్​ వీడియోల్లో ఆ పని ఎక్కువ సేపు​ ఎలా చేయగలుగుతారు? అంగస్తంభన అంతసేపు ఎలా ఉంటుంది? అసలు నిజాలు..

Sharath Chitturi HT Telugu

లైంగిక సంబంధాలపై ప్రజలకు ఉన్న “అత్యంత విధ్వంసక నమ్మకం” ఏంటి? ఈ విషయంపై ప్రముఖ సెక్సాలజిస్ట్​ డాక్టర్​ జైన్​ స్పందించారు. లైంగిక జీవితంలో అపోహలు- వాస్తవాల గురించి మాట్లాడారు.

పోర్న్​ వీడియోల్లో ఎక్కువ సేపు సెక్స్​ ఎలా చేస్తారు?

లైంగిక ఆరోగ్యంపై అనేక అపోహలు సమాజంలో లోతుగా పాతుకుపోయి, మన అవగాహనను, అనుభవాలను ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా పోర్న్​ వీడియోలు చూసి, అందులో చూపించేవే నిజం అని చాలా మంది నమ్ముతారు. తద్వారా వారి శృంగార జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలోప్రముఖ సెక్సాలజిస్ట్​ డాక్టర్​ సంకల్ప్​ కుమార్​ జైన్​ లైంగిక ఆరోగ్యంపై ‘అపోహలు- వాస్తవాలు’ గురించి మాట్లాడారు. ప్రముఖ యూట్యూబర్​ రాజ్​ షమానీతో చేసిన పాడ్​క్యాస్ట్​లో కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.

పోర్న్​ వీడియోల్లో అంగస్తంభన ఎక్కువసేపు ఎలా ఉంటుంది?

“లైంగిక సంబంధాలపై ప్రజలకు ఉన్న అత్యంత విధ్వంసక నమ్మకం” ఏంటి అని హోస్ట్​ అడిగిన ప్రశ్నకు..”పోర్న్ వీడియోల్లో చూసినట్లుగా మనం 30 నిమిషాల పాటు నాన్-స్టాప్‌గా లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అనుకోవడం,” అని జవాబిచ్చారు డాక్టర్​ జైన్​.

“మీరు పోర్న్ వీడియోల్లో చూసే అన్ని పురుషాంగాలకు ‘పాపావెరిన్’ (papaverine) ఇంజెక్ట్ చేస్తారు. అందుకే అంగస్తంభన ఎక్కువసేపు ఉంటుంది. మీరు అదే చేస్తే, అది 1-2 గంటల పాటు ఉంటుంది. అలాగే, ‘ఎక్స్‌ట్రా టైమ్ కండోమ్స్’ అని ఉంటాయి, వాటిలోని లూబ్రికెంట్‌లో తిమ్మిరిని కలిగించే ఏజెంట్లు ఉంటాయి. అవి మీ అవయవాన్ని తిమ్మిరి పట్టేలా చేసి, మీకు అదనపు సమయాన్ని అందిస్తాయి,” అని వివరించారు.

మంచి శృంగారానికి సగటు సమయం ఎంత?

‘మంచి లైంగిక సంబంధానికి సగటు సమయం ఎంత’ అని అడగ్గా.. “కనీసం 40 నుంచి 50 స్ట్రోక్‌లతో కూడిన 15- 20 నిమిషాల పెనెట్రేటివ్ సెక్స్,” అని జవాబిచ్చారు డాక్టర్​ జైన్​.

ఈ లైంగిక సమయాన్ని దీనిని మూడు విభాగాలుగా విభజించారు. అవి ఫోర్‌ప్లే, రోల్‌ప్లే, రౌండ్స్.

ఇన్​స్టాగ్రామ్​లో రాజ్​ షమానీ వీడియోని ఇక్కడ చూడండి :

లైంగిక ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మీకు అనేక మంది భాగస్వాములు ఉన్నా లేదా ఒకే వ్యక్తితో ఎంతోకాలం ఉన్నా, సురక్షితమైన లైంగిక సంబంధాలు (సేఫ్​ సెక్స్​) ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. 2023లో హెచ్‌టీ లైఫ్‌స్టైల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ముంబైలోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డా. రీతు హిందూజా మాట్లాడుతూ.. లైంగిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చో ఎనిమిది చిట్కాలతో పంచుకున్నారు.

అవి.. సేఫ్​ సెక్స్​, ఫెర్టిలిటీపై అవగాహనను పెంచుకోవడం, భాగస్వామితో మాట్లాడటం, హెచ్​ఐవీ టెస్ట్​ చేయించుకోవడం, ఆరోగ్యవంతమైన లైఫ్​స్టైల్​ని అలవాటు చేసుకోవడం, ఎప్పటికప్పుడు చెకప్స్​ చేయించుకోవడం.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పూర్తి అవగాహన కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024