నటుడిగా 50 ఏళ్లు అవుతోంది.. మా టైమ్‌లో ఇలా చేసేవాళ్లం కాదు.. మోహన్ బాబు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నటుడిగా 50 ఏళ్లు అవుతోంది.. మా టైమ్‌లో ఇలా చేసేవాళ్లం కాదు.. మోహన్ బాబు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ మూవీ కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా వ్యవహరించిన కన్నప్ప జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్ 28న కన్నప్ప థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కామెంట్స్ చూస్తే..!

నటుడిగా 50 ఏళ్లు అవుతోంది.. మా టైమ్‌లో ఇలా చేసేవాళ్లం కాదు.. మోహన్ బాబు కామెంట్స్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కన్నప్ప. తెలుగులో మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు.

కన్నప్ప థ్యాంక్స్ మీట్

ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్ 28న కన్నప్ప థ్యాంక్స్ మీట్ నిర్వహించింది మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో నటుడు మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. “ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మా టైమ్‌లో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని అన్నారు.

తిరిగి ఏం ఇవ్వగలను

“కన్నప్ప సక్సెస్ తరువాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను. ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు” అని మోహన్ బాబు తెలిపారు.

“ఆ భగవంతుడి ఆజ్ఞతోనే ఈ సినిమాను తీశామనిపిస్తుంది. అందరి ప్రోత్సాహం ఉండబట్టే ఇక్కడి వరకు రాగలిగాం. వినయ్ లేకపోతే.. కన్నప్ప చిత్రం ఉండేది కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు” అని నిర్మాత, నటుడు మోహన్ బాబు చెప్పారు.

ఇదంతా శివలీల

మంచు విష్ణు మాట్లాడుతూ .. “మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్” అని చెప్పుకొచ్చారు.

“మోహన్ బాబు గారి ఫ్యామిలీతో నాకు ఎంతో మంచి సంబంధం ఉంది. కన్నప్ప చిత్రం అద్భుతం చేసింది. ఇంతటి ప్రేమను కన్నప్ప దక్కించుకుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. విష్ణు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తరతరాలు నిలిచిపోయే సినిమా అవుతుంది” అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి తెలిపారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024