





Best Web Hosting Provider In India 2024

మలయాళం స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. అదిరిపోయిన గ్లింప్స్ వీడియో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకే వస్తోంది. సోమవారం జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడించింది.
జియోహాట్‌స్టార్ సోమవారం (జూన్ 30) తమ రాబోయే దేశభక్తి చిత్రం ‘సర్జమీన్’ (Sarzameen) మొదటి లుక్‌ను విడుదల చేసింది. ఈ మూవీలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జియోహాట్‌స్టార్ తమ యూట్యూబ్ ఛానెల్లో ఒక నిమిషం పైగా నిడివి ఉన్న వీడియోను పంచుకుంది.
‘సర్జమీన్’ ఫస్ట్ లుక్ వీడియో
జియోహాట్‌స్టార్ ఓటీటీ సర్జమీన్ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో క్లిప్‌లో.. పృథ్వీరాజ్ సుకుమారన్ దేశానికి ప్రాధాన్యతనిచ్చే కఠినమైన, నిజాయతీ గల ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించాడు. కాజోల్ అతని భార్యగా నటించింది. ఆమె పలు రకాల ఎమోషన్స్ తో ఫైట్ చేస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. సరిహద్దులో పృథ్వీరాజ్ శత్రువులతో పోరాడుతుండగా.. కాజోల్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్, ‘నాదానియాన్’లో రొమాంటిక్ పాత్రతో అరంగేట్రం చేసిన తర్వాత, ఈ మూవీలో పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించాడు. వీడియోలో అతడు గడ్డంతో ఇంటెన్స్ లుక్ లో ఉండటం చూడొచ్చు. ఇందులో అతడో ఉగ్రవాది పాత్రలో నటించినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.
‘సర్జమీన్’ స్టోరీ ఏంటంటే?
కశ్మీర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ.. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్ తో జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ వీడియోను షేర్ చేసింది. జులై 25న ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.
చిత్రం గురించి మాట్లాడుతూ, ‘సర్జమీన్’తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న కాయోజ్ ఇరానీ ఇలా అన్నాడు. “‘సర్జమీన్’ నా హృదయంలో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం దర్శకుడిగా నా మొదటి ఫీచర్ ఫిల్మ్ కావడం వల్లనే కాదు, లోతైన సన్నిహితమైన, తీవ్రమైన కథను చెప్పే అవకాశాన్ని ఇది నాకు ఇచ్చింది” అని కాయోజ్ అన్నాడు.
సంబంధిత కథనం