





Best Web Hosting Provider In India 2024

251 మంది దాతలతో హీరో కృష్ణ మానినేని రక్తదాన శిబిరం.. సింధూర సంజీవని పేరుతో కార్యక్రమం
జెట్టి సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ మానినేని 251 మంది దాతలతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించాడు. జూన్ 14న ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సింధూర సంజీవని పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. గత 8 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో హీరో కృష్ణ మానినేని ఆకట్టుకుంటున్నాడు.
టాలీవుడ్లో జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని సేవా దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 100 డ్రీమ్స్ సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు.
సింధూర సంజీవనిపేరుతో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ మానినేని చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి. 100 డ్రీమ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు కృష్ణ మానినేని జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డేను పురస్కరించుకొని “సింధూర సంజీవని” పేరిట ఇవాళ (జూన్ 30) రక్తదాన శిబిరం నిర్వహించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంకులో
చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 251 మంది దాతలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు హీరో మానినేని కృష్ణ. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు, 100 డ్రీమ్స్ వాలంటీర్స్, మెగాస్టార్-పవర్ స్టార్ అభిమానులు పాల్గొన్నారు.
2022లో వచ్చిన జెట్టీ మూవీతో
అలాగే, ఈ కార్యక్రమంలో పంచ్ ప్రసాద్, జబర్దస్త్ రాముతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేశారు. ఇదిలా ఉంటే, జెట్టి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ మానినేని. 2022లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ మానినేనికి జోడీగా హీరోయిన్ నందితా శ్వేత నటించింది.
జెట్టీ సినిమా నటీనటులు
అలాగే, జెట్టీ సినిమాలో వీళ్లిద్దరితోపాటు కిశోర్, మైమ్ గోపీ, సురభి ప్రభావతి, శివాజీ రాజా, ఎమ్ఎస్ చౌదరి, జీవా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 2022 నవంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు.
జెట్టీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్
జాలరిల జీవిత నేపథ్యంలో తెరకెక్కిన జెట్టిని యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్గా మలిచారు మేకర్స్. రెండు గంటల 14 నిమిషాలు ఉన్న జెట్టి సినిమాకు ఐఎమ్డీబీ నుంచి పదికి 7.9 రేటింగ్ అందుకుని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం జెట్టీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆహాలో జెట్టీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం