







Best Web Hosting Provider In India 2024
సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ ఇదే
సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ విడుదలైంది. జులై 15 నుంచి పరీక్షలు మెుదలుకానున్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు cbse.gov.in అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ను చూసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 2025 జూలై 15 నుండి 22 వరకు సీబీఎస్ఈ 10 వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష 2025 జరుగుతాయి. చాలా పేపర్లకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. మరికొన్నింటికి ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 జూలై 15న జరగనుంది. చాలా సబ్జెక్టులకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, మరికొన్ని సబ్జెక్టులకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ ఇలా ఉంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను మే 13, 2025న ప్రకటించింది. 12వ తరగతిలో 17.04 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 16.92 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 14.96 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. అదేవిధంగా పదో తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 23.71 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 22.21 లక్షల మంది ఉత్తీర్ణత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66 శాతంగా నమోదైంది.
Best Web Hosting Provider In India 2024
Source link