నేను స్క్రీన్‌పై స్మోకింగ్ చేయను.. సినిమాను సినిమాలా చూడండి.. బలవంతంగా చూడమని ఎవరూ అడగడం లేదు కదా: రష్మిక కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నేను స్క్రీన్‌పై స్మోకింగ్ చేయను.. సినిమాను సినిమాలా చూడండి.. బలవంతంగా చూడమని ఎవరూ అడగడం లేదు కదా: రష్మిక కామెంట్స్

Hari Prasad S HT Telugu

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాను నటించిన యానిమల్ మూవీపై వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించింది. సినిమాను సినిమాలాగా చూడాలని, ఎవరూ ఓ మూవీ చూడాలని బలవంతం చేయడం లేదు కదా అని ప్రశ్నించింది.

నేను స్క్రీన్‌పై స్మోకింగ్ చేయను.. సినిమాను సినిమాలా చూడండి.. బలవంతంగా చూడమని ఎవరూ అడగడం లేదు కదా: రష్మిక కామెంట్స్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ మూవీపై బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో అన్నే విమర్శలు కూడా వచ్చాయి. రష్మిక మందన్న, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. హింస, స్త్రీ ద్వేషంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై తాజాగా రష్మిక మందన్నా స్పందించింది. ఇటీవల మోజో స్టోరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.

‘యానిమల్’ను సమర్థించిన రష్మిక

యానిమల్‘ మూవీని సమర్థిస్తూ.. ఒకవేళ తెరపై స్మోకింగ్ చేయమని అడిగితే ఆ సినిమాను వదులుకుంటానని రష్మిక స్పష్టం చేసింది. అయితే సినిమాను సినిమాలాగా చూడాలని స్పష్టం చేసింది. “నేను సినిమాను సినిమాగా చూశాను. హీరో తెరపై స్మోకింగ్ చేస్తే, అది ఇతరులను ప్రభావితం చేస్తుందని అంటారు. కానీ ఈ రోజుల్లో, సమాజంలో స్మోకింగ్ చేయడం చాలా సాధారణం.

నేను ఏ విధంగానూ ప్రభావితం కావడానికి సినిమా చూడను. వ్యక్తిగతంగా, నేను తెరపై స్మోకింగ్ చేయను. కానీ అది నా అభిప్రాయం. నేను ‘యానిమల్’లో నటించాను. సినిమాను సినిమాగా చూడండి అని ఇప్పటికీ చెబుతాను. ఇప్పుడు, ఎవరైనా ఒక సినిమా ద్వారా ప్రభావితం కావాలంటే, మీకు నచ్చిన సినిమాలు చూడండి. ఎవరూ ఏ సినిమాను చూడమని బలవంతం చేయడం లేదు. అలా అయితే, ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది కదా” అని రష్మిక కామెంట్ చేసింది.

అందరిలోనూ చెడు ఉంటుంది

యానిమల్ సినిమా చుట్టూ జరిగిన చర్చ తనను ఆశ్చర్యపరచలేదని రష్మిక చెప్పింది. “మనలో ప్రతి ఒక్కరిలోనూ గ్రే పాత్రలు ఉంటాయి. నలుపు, తెలుపే కాదు మనందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయి. సందీప్ రెడ్డి వంగా ఒక గందరగోళమైన పాత్ర గురించి చెప్పాడంతే. భారీ వసూళ్లు వచ్చాయి కాబట్టి ప్రేక్షకులు ఆ సినిమాను ఆమోదించారని నేను అనుకుంటాను.

అందువల్ల ఈ చర్చపై నేనేమీ కలత చెందలేదు. మేము ఈ సినిమాను తీశాం. అది బాగా ఆడింది. ప్రేక్షకులు దానిని ఇష్టపడ్డారు లేదా ఇష్టపడలేదు. అది వారి వ్యక్తిగత విషయం. నటులు ఈ పాత్రలను పోషించినందుకు వారిని జడ్జ్ చేయకూడదు. నటనకు ఒక కారణం ఉంటుంది” అని రష్మిక స్పష్టం చేసింది. తెరపై నటులు కేవలం నటిస్తున్నారని, వారి నిజ జీవిత వ్యక్తిత్వాలు వారు పోషించే పాత్రలకు భిన్నంగా ఉంటాయని ఆమె తెలిపింది.

యానిమల్ మూవీ గురించి..

అర్జున్ రెడ్డితో పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ యాక్షన్ డ్రామాలో రణ్‌బీర్ కపూర్.. రణ్‌విజయ్ సింగ్ పాత్ర పోషించగా, అతని భార్య పాత్రలో రష్మిక నటించింది. ఆల్ఫా మేల్ అంటూ పురుషహంకార పోకడలను ఇందులో చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. యానిమల్ పార్క్ పేరుతో దీనికి సీక్వెల్ కూడా సందీప్ ప్లాన్ చేశాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024