





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో ఆహా అనిపించే 6 సినిమాలు.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. ఒక్కోటి ఒక్కో జోనర్.. ఇక్కడ చూసేయండి!
ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు దూసుకెళ్తున్నాయి. అయితే, వాటిలో చూసేందుకు, ఆహా అనిపించేలా ఆరు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కోటి ఒక్కో జోనర్ ఉన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
అందరి మన్ననలు పొందుతున్నతెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఆహా ఒకటి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ తెలుగు ఓటీటీ కంటెంట్‌ను అందించే ఆహా ఓటీటీలోని టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా వచ్చేసింది. వీటిలో చూసేందుకు ఆహా అనిపించే ఆరు ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
23 ఇరవై మూడు ఓటీటీ
రీసెంట్‌గా ఆహాలో ఓటీటీ రిలీజ్ అయిన సోషల్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ 23 ఇరవై మూడు. ఒకరు చేసిన ఓ దొంగతనం 23 మంది ప్రాణాలు ఎలా తీసుకున్నదో చెప్పేదే ఈ సినిమ కథ. జూన్ 27న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 23 ఆహా ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో 2 రెండో స్థానంలో దూసుకుపోతూ బెస్ట్‌గా నిలిచింది.
అలప్పుళ జింఖానా ఓటీటీ
ప్రేమలు హీరో నస్లెన్ కె గఫూర్ హీరోగా చేసిన తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం అలప్పుళ జింఖానా. తెలుగు డబ్బింగ్ అయి ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా ఆహా ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కూడా చూసేందుకు బెస్ట్‌గా ఆహా అనిపించేలా ఉంటుంది.
ఘటికాచలం ఓటీటీ
డాక్టర్ అవ్వాలనుకున్న విద్యార్థిపై ఆత్మ ఆవహిస్తే ఎలా ఉంటుందనే స్టోరీతో తెరకెక్కిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీనే ఘటికాచలం. ఇటీవల ఆహాలో ఓటీటీ రిలీజ్ అయిన ఘటికాచలం టాప్ 6 ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇది కూడా చూసేందుకు బెస్ట్‌గా ఉంది.
అర్జున్ సన్నాఫ్ వైజయతి ఓటీటీ
కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఓటీటీ రిలీజ్‌కు వచ్చి చాలా రోజులు అయిన ఈ సినిమా ఇప్పటికీ ఆహాలో టాప్ 7 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. తెలుగులో ఉన్న సినిమా కూడా చూసేందుకు బెస్ట్.
సిన్ ఓటీటీ
లెస్బియన్ అయిన అమ్మాయి భార్యగా మారి భర్తతో బలవంతంగా శృంగారం చేసే కథతో తెరకెక్కిన తెలుగు మూవీ సిన్. 2020లో ఓటీటీ రిలీజ్ అయిన సిన్ ఇప్పటికీ ఆహాలో టాప్ 8 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. కాబట్టి ఇది కూడా చూసేందుకు బెస్ట్.
ష్.. ఓటీటీ
నలుగురి జీవితాల శృంగారం చుట్టూ తిరిగే కథనే ష్.. తమిళ బొల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా వచ్చిన ష్.. తెలుగులో డబ్ అయి ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ టాప్ 10 స్థానంలో ఆహా ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచింది. కాబట్టి, ఇది కూడా చూసేందుకు బెస్ట్‌గా ఉంది.
ఇదే కారణం
ఇలా టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో ఆహా అనిపించేలా ఆరు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మిగత నాలుగు సినిమాల కంటే ఇవి బెస్ట్‌గా ఉన్నాయి. వాటిలో టాప్ 5లో ఉన్న 3 రోజెస్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్‌ను ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు వీక్షించారు కాబట్టి ఆహా అనిపించే ఆరు సినిమాల జాబితాలో ఎంచుకోలేదు.
సంబంధిత కథనం