IBPS PO 2025 : 5200కుపైగా పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలు- పూర్తి వివరాలు..

Best Web Hosting Provider In India 2024


IBPS PO 2025 : 5200కుపైగా పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలు- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu

IBPS PO Recruitment 2025 : బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్​! ఐబీపీఎస్​ పీఓ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, వయస్సు పరిమితి, ఫీజు సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐబీపీఎస్​ పీఓ 2025 రిజిస్ట్రేషన్​ వివరాలు.. (Official website, screenshot)

ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్‌మెంట్ ట్రైనీ (పీఓ/ఎంటీ) రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే నోటిఫికేషన్​ని విడుదల చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్​).. తాజాగా రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ibps.in వెబ్‌సైట్ ద్వారా ఐబీపీఎస్​ పీఓ 2025కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐబీపీఎస్​ పీఓ రిక్రూట్​మెంట్​ 2025: ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (దరఖాస్తు ఫారమ్ సవరణ/మార్పులతో పాటు): జులై 1 నుంచి 21 వరకు.

దరఖాస్తు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు: జులై 1 నుంచి 21 వరకు.

ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్: ఆగస్టు 2025.

ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్: ఆగస్టు 2025.

ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2025.

ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్ ఫలితం: సెప్టెంబర్ 2025.

మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్: సెప్టెంబర్/అక్టోబర్ 2025.

మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 2025.

మెయిన్స్ ఫలితం: నవంబర్ 2025.

పర్సనాలిటీ టెస్ట్: నవంబర్/డిసెంబర్ 2025.

ఇంటర్వ్యూ: డిసెంబర్ 2025 / జనవరి 2026.

తాత్కాలిక కేటాయింపు (ప్రొవిజినల్ అలాట్‌మెంట్): జనవరి/ఫిబ్రవరి 2026.

ఐబీపీఎస్​ పీఓ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా పాల్గొంటున్న బ్యాంకుల్లో మొత్తం 5208 ఖాళీలు భర్తీ అవుతాయి. బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:

బ్యాంక్ ఆఫ్ బరోడా: 1000

బ్యాంక్ ఆఫ్ ఇండియా: 700

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 1000

కెనరా బ్యాంక్: 1000

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 500

ఇండియన్ బ్యాంక్: ఇంకా వెల్లడించలేదు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 450

పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200

పంజాబ్ అండ్​ సింధ్ బ్యాంక్: 358

యూకో బ్యాంక్: ఇంకా వెల్లడించలేదు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇంకా వెల్లడించలేదు

ఐబీపీఎస్​ పీఓ రిక్రూట్​మెంట్​ 2025 2025: అర్హత ప్రమాణాలు..

జులై 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి, 30 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి.

అదనంగా, ఐబీపీఎస్​ పీఓ 2025 కి అప్లే చేస్తున్న అభ్యర్థులు.. సంబంధిత బ్యాంకుల్లో చేరే సమయానికి సరైన క్రెడిట్ హిస్టరీని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. కనీస క్రెడిట్ స్కోర్ పాల్గొనే బ్యాంకుల విధానం ప్రకారం ఉంటుంది.

“సిబిల్​ లేదా సిబిల్​ని పోలిన సంస్థలు ఇచ్చే స్కోర్​ని జాయినింగ్​కి ముందు అభ్యర్థులు అప్డేట్​ చేసుకోవాలి. లేదా కనీసం ఎన్​ఓసీని పొందాలి. లేకపోతే ఆఫర్​ లెటర్​ ఉపసంహరిచుకుంటాము,” అని ఐబీపీఎస్​ తెలిపింది.

ఐబీపీఎస్​ పీఓ 2025 దరఖాస్తు రుసుము ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 175 కాగా, ఇతరులందరికీ రూ. 850.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ని చూడాల్సి ఉంటుంది. ఐబీపీఎస్​ పీఓ 2025 నోటిఫికేషన్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link