





Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి టుడే జూలై 15 ఎపిసోడ్: ఇంటి నుంచి వెళ్లిపోతానన్న శ్యామల.. విరాట్, చంద్రతో వ్రతం ప్లాన్..చెడగొట్టాలని కామాక్షి
నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ చేసిన వంటను తినను అని చెప్పేస్తాడు విరాట్. రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చుంటుంది చంద్ర. విరాట్, చంద్రతో దాంపత్య వ్రతం చేయించేందుకు శాలిని ప్లాన్ చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలని అనుకుంటారు కామాక్షి, శ్రుతి.
నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో విరాట్ కోసం ఎదురు చూస్తుంటుంది చంద్రకళ. తనను చెంపపై కొట్టిందే గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అని చంద్ర అంటే.. ఆపు నీ డ్రామాలు అని విరాట్ సీరియస్ అవుతాడు. భోజనం చేయమంటే చేయను అంటాడు. జగదీశ్వరి చెప్పడంతో సరే అమ్మ అని తినడానికి రెడీ అవుతాడు విరాట్.
ప్రసాదమే తినేసి
డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని కూరలు ఎవరు చేశారు అని అడుగుతాడు విరాట్. చంద్రకళ చేసిందని శ్యామల అంటే.. తన తల్లి చేసిన వంటనే తింటానని విరాట్ చెప్తాడు. కానీ దేవుని కోసం చేసిన ప్రసాదమే ఉందని చెప్తారు. ఆ పులిహోర కొంచమే ఉన్నా తినేసి వెళ్లిపోతాడు విరాట్. దీంతో చంద్రకళ ఎంతో బాధపడుతుంది. జగదీశ్వరి కూడా బాధపడితే శ్యామల ఓదార్చుతుంది. అనవసరంగా టెన్షన్స్ పెట్టుకోకు, నేను ఏదో ఒకటి చేస్తానని శ్యామల చెప్తుంది.
శిక్ష వేయొద్దు
చంద్రకళ ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. విరాట్ కూడా ఫీల్ అవుతాడు. బావ ద్వేషాన్ని భరించలేను స్వామి, చేయని తప్పునకు నాకు శిక్ష వేయొద్దు అని పొద్దున పూజ చేస్తుంది చంద్రకళ. చంద్ర అందరికీ హారతి ఇస్తుంది. మరోవైపు శాలిని టెన్షన్ పడటాన్ని కామాక్షి, శ్రుతి గమనిస్తారు. ఏం జరిగింది అని అడుగుతారు. చంద్రను ఫ్యామిలీ మొత్తం అసహ్యించుకునేలా చేయాలని శాలిని అంటుంది.
శ్యామల డ్రామా
విరాట్ ను పిలుస్తుంది శ్యామల. నువ్వు, నేను, చంద్రకళ గుడికి వెళ్లాలని శ్యామల చెప్తుంది. నీతో పాటు వస్తాను కానీ అనవసరమైన వాళ్లతో రాను, ఆవిడ వస్తే నేను మాత్రమే రాను అని విరాట్ అంటాడు. నా కంటే నీ పంతమే ఎక్కువైతే నేను బ్యాగు తీసుకుని వెళ్లిపోతా అని శ్యామల కోప్పడుతుంది. ఆనందంతో ఎగిరి గంతులేసిన కామాక్షి, శ్రుతి గదిలోకి వెళ్లి బ్యాగు సర్దుతారు. నన్ను పంపించేయాలని ఎంత ఆత్రుతగా ఉందో అని శ్యామల అంటుంది. అవమానం జరిగింది కదా వెళ్లిపో అని కామాక్షి చెప్తుంది.
జగదీశ్వరి ఆర్డర్
శ్యామల బ్యాగు తీసుకుని వచ్చి నేను వెళ్తాను వదినా అని అంటుంది. ఇక్కడ ఉండటం నా అల్లుడికి ఇష్టం లేదని అర్థమైంది. నేను వెళ్లిపోతా అన్నా మౌనంగానే ఉన్నావు కదా. నా మాట అంటే ఏ మాత్రం లెక్కలేదనే కదా అని శ్యామల అంటుంది. నా మాటకు విలువ ఇవ్వనప్పుడు ఎందుకు ఉండాలి? అని శ్యామల ప్రశ్నిస్తుంది. శ్యామల మాట కాదంటే నా మాట కాదన్నట్లే, నా మాటకు విలువ లేనట్లే అని జగదీశ్వరి చెప్తుంది. దీంతో గుడికి వెళ్లడానికి విరాట్ రెడీ అవుతాడు.
దాంపత్య వ్రతం
గుడి ప్లాన్ ఏంటో తెలియక దుష్ట త్రయం టెన్షన్ పడతారు. మనం కూడా గుడికి వెళ్లి ప్లాన్ తెలుసుకుందామని కామాక్షి చెప్తుంది. కానీ శాలిని మాత్రం రానంటుంది. ఏం ప్లాన్ చేశావే, అత్తయ్య మనల్ని గుడికి ఎందుకు తీసుకొచ్చింది? అని చంద్రకళను అడుగుతాడు విరాట్. విరాట్, చంద్ర గొడవ పడటం చూసి గుడిలోకి రమ్మని అంటుంది శ్యామల.
మీ ఇద్దరితో దాంపత్య వ్రతం చేయించబోతున్నా అని ట్విస్ట్ ఇస్తుంది శ్యామల. గొడవలు ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే చిక్కులు తొలగిపోతాయని శ్యామల చెప్తుంది. వ్రతం పూర్తయిందో అనుకునో వాడే నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు అని చంద్రతో శ్యామల అంటుంది. అయితే రహస్యంగా ఈ వ్రతం గురించి వింటారు కామాక్షి, శ్రుతి. ఈ వ్రతాన్ని చెడగొడతామని అనుకుంటారు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్