



Best Web Hosting Provider In India 2024

భర్త వివాహేతర బంధం.. యువ డాక్టర్ బలవన్మరణం.. హత్యేనంటున్న తల్లిదండ్రులు
వివాహేతర సంబంధం వైద్య దంపతుల కాపురాన్ని కూల్చివేసింది. భర్త సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.
హసన్‌పర్తిలో నివసిస్తున్న వైద్య దంపతుల కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. ఓ యువ వైద్యురాలి ప్రాణాలను బలిగొంది. ఉమ్మడి వరంగల్లు జిల్లా పరిధిలోని ములుగు జిల్లా కమలాపూర్ మండలం మంగపేటకు చెందిన వైద్యుడు అల్లాడి సృజన్ వరంగల్ లో కార్డియోలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. వరంగల్‌లో డాక్టర్‌గా సేవలందిస్తున్న ప్రత్యూషతో 8 ఏళ్ల క్రితం పెళ్లయింది.
డాక్టర్ సృజన్‌కు ఓ ప్రచార కార్యక్రమంలో హన్మకొండకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో సృజన్ ప్రత్యూషను వేధించడం మొదలుపెట్టాడు. ప్రత్యూష అత్తమామలు కూడా ఆమెకు అండగా నిలవకపోగా సృజన్ వైపు నిలిచారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనపై వేధింపులకు పాల్పడడాన్ని భరించలేక ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో డాక్టర్ సృజన్, అతడి తల్లిదండ్రులపై హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
‘ఆత్మహత్య కాదు’
అయితే ప్రత్యూష ఒంటిపై గాయాలు ఉన్నాయని, అది ఆత్మహత్య కాదని, సృజన్, ఆయన తల్లిదండ్రులు కలిసి తీవ్రంగా హింసించి చంపారని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా పోలీసులు డాక్టర్ సృజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టాపిక్