





Best Web Hosting Provider In India 2024

టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత.. ఆయన మరణానికి అసలు కారణం ఇదే!
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ఇటీవలే దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం (జులై 18) రాత్రి టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (54) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో మరణించడంపై ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఇటీవల టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో కాలం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ (53) మరణించారు. శుక్రవారం (జులై 18) రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు.
రెండు కిడ్నీలు డ్యామేజ్
కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఫిష్ వెంకట్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు డ్యామేజ్ కావడంతో డయాలిసిస్ కోసం బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో వెంకట్‌ను కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే, రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్లు ఆయన కుమార్తె తెలిపారు.
50 లక్షల ఖర్చు
రెండు కిడ్నీల మార్పుకు రూ. 50 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్స్ చెప్పినట్లు ఫిష్ వెంకట్ కూతురు ఇటీవల మీడియాకు వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్నారు ఫిష్ వెంకట్ కుమార్తె, కుటుంబ సభ్యులు.
విశ్వక్ సేన్ సాయం
అది చూసిన కొంతమంది సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ ఆరోగ్యం కోసం విరాళం అందించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. అలాగే, మంత్రి వాకిటి శ్రీహరి నటుడు ఫిష్ వెంకట్‌ను పరామర్శించి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. మరికొంత ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు.
సెలబ్రిటీల సంతాపం
అయితే, కిడ్నీ దాత దొరక్కపోవడంతో ఆరోగ్యం క్షీణించి ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు. కిడ్నీ వ్యాధితో పోరాడి ఫిష్ వెంకట్ కన్నుమూశారు. నటుడి మరణం పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఫిష్ వెంకట్ మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
చేపల వ్యాపారంతో
ఇక ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్ చేపల వ్యాపారంతో ఆయనకు ఫిష్ వెంకట్ గుర్తింపు వచ్చింది. అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
వందకుపైగా సినిమాల్లో
వందకుపైగా సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫిష్ వెంకట్ అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి తదితర సినిమాలతో ఫిష్ వెంకట్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సంబంధిత కథనం