




Best Web Hosting Provider In India 2024
ఇంకొన్ని రోజుల్లో నీట్ పీజీ 2025- పరీక్షకు ముందు అభ్యర్థులకు కీలక అలర్ట్!
నీట్ పీజీ 2025 పై లేటెస్ట్ అప్డేట్! ఎగ్జామ్ సిటీ స్లిప్ వివరాలు, అడ్మిట్ కార్డు విడుదలపై ప్రకటన వెలువడింది. అంతేకాదు, మోసపూరిత చర్యలకు గురికాకుండా ఉండేందుకు అధికారులు కీలక సూచనలు సైతం జారీ చేశారు. పూర్తి వివరాలు..
నీట్ పీజీ 2025 అభ్యర్థులకు అలర్ట్! నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్), ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ 2025 పరీక్షా నగరాల వివరాలు జులై 21న దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా తెలుస్తాయని తెలియజేసింది.
నీట్ పీజీ 2025 అప్డేట్స్..
జూన్‌లో జరగాల్సిన నీట్ పీజీ 2025 ఆగస్ట్ 3కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక జూన్ 13 నుంచి 17 వరకు అభ్యర్థులు తమ పరీక్షా నగరం ఎంపికలను తిరిగి సమర్పించడానికి ఎన్బీఈఎంఎస్ అనుమతి ఇచ్చింది.
నీట్ పీజీ 2025 అడ్మిట్ కార్డులు జులై 31న విడుదలవుతాయి. వీటిలో ఇతర వివరాలతో పాటు అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాల చిరునామాను తెలుసుకోవచ్చు.
ఏవైనా సందేహాలు ఉంటే, అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ హెల్ప్‌లైన్ నెంబర్ +91-7996165333 ని ఉదయం 9:30 నుంచి సాయంత్రం 06:00 గంటల మధ్య సంప్రదించవచ్చు.
నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఛానెళ్లపై ఎన్బీఈఎంఎస్ హెచ్చరిక!
నీట్ పీజీ అభ్యర్థులను ఉద్దేశించి ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో.. తమకు రెండు అధికారిక వెబ్సైట్లు ఉన్నాయని ఎన్బీఈఎంఎస్ తెలిపింది. అవి.. natboard.edu.in, nbe.edu.in. పరీక్షలకు సంబంధించిన ప్రామాణిక సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్సైట్లను చూడాలని సూచించింది.
ఆ నోటిఫికేషన్లో, ఎన్బీఈఎంఎస్ ఒక అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను కూడా ప్రస్తావించింది. దీని ద్వారా అభ్యర్థులు నీట్ పీజీ 2025, ఇతర పరీక్షల గురించి ప్రామాణిక సమాచారాన్ని పొందవచ్చు.
జులై 2020 నుంచి తాము జారీ చేసిన అన్ని నోటీసులకు క్యూఆర్ కోడ్లు ఉన్నాయని, ఇవి వినియోగదారులను అధికారిక వెబ్‌సైట్‌కు డైరక్ట్ చేస్తాయని ఎన్బీఈఎంఎస్ పేర్కొంది.
“నీట్ పీజీ 2025 నేపథ్యంలో నకిలీ ఏజెంట్లు / దళారులు స్ఫూఫ్డ్ నోటీసులు, ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లు లేదా సోషల్ మీడియాలోని కంటెంట్లను ఉపయోగించి ఎన్బీఈఎంఎస్ పేరుతో ఫిషింగ్ కోసం అభ్యర్థులకు తప్పుడు, బోగస్ వాదనలు చేయవచ్చు,” అని ఎన్బీఈఎంఎస్ హెచ్చరించింది.
“నీట్ పీజీ 2025 అభ్యర్థులు అటువంటి స్ఫూఫ్డ్ ఈమెయిళ్లు / ఎస్ఎంఎస్ లేదా ఫోర్జరీ పత్రాలు లేదా సోషల్ మీడియా ద్వారా ఏ అభ్యర్థికైనా ఏ విధంగానైనా సహాయం చేస్తామని తప్పుడు, బోగస్ వాదనలు చేసే అసాధారణ ఏజెంట్లు / దళారులచే మోసపోకుండా లేదా తప్పుదారి పట్టకుండా ఉండాలని సూచిస్తున్నాము,” అని వివరించింది.
ఎన్బీఈఎంఎస్ నిర్వహించే ఏ పరీక్షలలోనూ మంచి మార్కులు సాధించడం గురించి తమ ఈమెయిళ్లు లేదా ఎస్ఎంఎస్ సందేశాలను అభ్యర్థులకు పంపదని బోర్డు తెలిపింది.
మోసపూరిత సంఘటనలను reportumc@natboard.edu.in కు/లేదా స్థానిక పోలీసులకు తదుపరి విచారణ కోసం నివేదించాలని బోర్డు అభ్యర్థులను కోరింది.
నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ- ఫలితాల వివరాలు..
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్ష ఆగస్టు 3, 2025న జరగనుంది. పరీక్ష ఒకే షిఫ్టులో – ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు – నిర్వహించనున్నారు. ఫలితాలు సెప్టెంబర్ 3, 2025న ప్రకటిస్తారు.
నీట్ పీజీ 2025పై మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link