రేపే జీ తెలుగు బ్లాక్ బస్టర్ బోనాలు.. జోగిని శ్యామలతో ఎల్లమ్మ కథ.. శంకర్ దాదాగా ఆర్కే రోజా, ఏటీఎమ్‌గా హీరో శ్రీకాంత్

Best Web Hosting Provider In India 2024

రేపే జీ తెలుగు బ్లాక్ బస్టర్ బోనాలు.. జోగిని శ్యామలతో ఎల్లమ్మ కథ.. శంకర్ దాదాగా ఆర్కే రోజా, ఏటీఎమ్‌గా హీరో శ్రీకాంత్

Sanjiv Kumar HT Telugu

జీ తెలుగులో బ్లాక్ బస్టర్ బోనాలు కార్యక్రమాన్ని రేపు (జులై 20) ప్రసారం చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్, హీరోయిన్ రోజా నాయకత్వంలో సీరియల్ నటీనటులు రెండు టీమ్స్‌గా పాల్గొననున్నారు. అలాగే, ఎల్లమ్మ కథను జోగిని శ్యామల అందరి మనసుకు హత్తుకునేలా చెప్పనున్నారు.

రేపే జీ తెలుగు బ్లాక్ బస్టర్ బోనాలు.. జోగిని శ్యామలతో ఎల్లమ్మ కథ.. శంకర్ దాదాగా ఆర్కే రోజా, ఏటీఎమ్‌గా హీరో శ్రీకాంత్

వినోదభరితమైన కంటెంట్​‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియల్స్‌​తో పాటు సరికొత్త కాన్సెప్ట్స్‌తో నాన్ ఫిక్షన్ షోలతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రత్యేక సందర్భాలను మరింత ప్రత్యేకంగా మలిచేందుకు ఎప్పుడూ ముందుండే జీ తెలుగు మరో ఈవెంట్‌తో సందడి చేయనుంది.

బోనాల సందర్భంగా

బోనాల సందర్భంగా మరో ప్రత్యేక కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రానుంది జీ తెలుగు. తెలంగాణ బోనాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ‘బ్లాక్​‌బస్టర్​ బోనాలు’ జూలై 20న ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు.

యాంకర్స్‌గా రవి, వర్షిణి

జీ తెలుగు నటీనటుల ఆటపాటలు, అల్లరితో సందడిగా సాగిన ఈ కార్యక్రమానికి యాంకర్​ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. సంప్రదాయం, సంస్కృతి మేళవింపుతో ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు, హాస్య సన్నివేశాలు, వినోదాత్మక స్కిట్‌లు, మధురమైన పాటలతోపాటు మరెన్నో వినోదం పంచే కార్యక్రమాలతో ఆకట్టుకోనున్నారు.

శ్రీకాంత్-రోజా నాయకత్వంలో

జీ తెలుగులో ప్రసారమయ్యే మధ్యాహ్నం, ప్రైమ్‌టైమ్ సీరియల్స్​ నటీనటులు అంతా హీరో శ్రీకాంత్, సీనియర్ హీరోయన్, నటి ఆర్కే రోజా నాయకత్వంలో రెండు టీమ్స్‌గా ఏర్పడి పోటీపడనున్నారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు నటీనటులతోపాటు జోగిని శ్యామల దేవత ఎల్లమ్మ కథను హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించనున్నారు.

అఖండ పాత్రను

“హగ్ చేస్కో, సాంగ్ గెస్ చేస్కో” అనే ఆటతో అంత్యాక్షరి ఆటతో ప్రేక్షకులను అలరిస్తారు. శ్రీకాంత్ తన సూపర్​ హిట్​ సినిమా “ప్రేయసిరావే”లోని గాజులు విసిరే సన్నివేశాన్ని పునఃసృష్టించనున్నారు. డ్రామా జూనియర్స్​ పిల్లలు బాలకృష్ణ “అఖండ” పాత్రను హాస్యాస్పదంగా అనుకరించి కడుపుబ్బా నవ్వించనున్నారు.

శంకర్ దాదాగా రోజా

రోజా చిరంజీవి శంకర్​ దాదా పాత్రలో, శ్రీకాంత్ తన ఏటీఎం పాత్రలో అదరగొడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తారు. మధ్యాహ్నం, ప్రైమ్‌టైమ్ సీరియల్స్ హీరోయిన్‌ల మధ్య జరిగే నృత్య పోటీ వేదికను ఉర్రూతలూగిస్తుంది.

జీ తెలుగు బోనాలు

చిన్నారులు రాయన్, కుషి తమ పాటలతో అందరి మనసులను గెలుచుకుంటారు. బోనాలు సందర్భంగా మహిళా కళాకారులకు గాజులు పంచడం తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది. వైభవంగా జరిగిన ఈ జీ తెలుగు బ్లాక్ బస్టర్​ బోనాలు కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూసేయండి అంటూ మేకర్స్ ప్రకటించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024