




Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ వాసులరా…. అలర్ట్ గా ఉండండి – పలు ప్రాంతాల్లో భారీ వర్షం..!
హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచి కొడుతోంది. చాలా ప్రాంతాల్లో వర్షం నీరు వరదలై పారుతోంది. ప్రజలంతా ఇంటికే పరిమితి కావాలని… అత్యవసరమైతేనే బయటికి రావాలని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా వాతావరణం మారిపోగా… భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, ఉప్పల్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వాన కురుస్తోంది. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
భారీ వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెహదీపట్నం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో… నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. జూబ్లీహిల్స్ అపోలో రోడ్డులోనూ ఇదే పరిస్థితి ఉంది.
రాత్రి కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని కోరారు. చెట్లు, కరెంట్ స్తంభాల వద్ద నిలబడవద్దని కోరారు.
అప్రమంత్తంగా ఉండాలి – మంత్రి పొన్నం
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన ద్వారా కోరారు. కనీస అవసరాలు, విద్యుత్, రవాణా వంటి వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
“అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వ సూచనలు గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని మనవి.అకాల వర్షం తో హైదరాబాద్ మహానగరం లో హైడ్రా నిరంతరం ప్రజల కోసం పని చేస్తుంది” అని తెలిపారు.
టాపిక్