





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోని తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్.. ఈ వీకెండ్ ప్లాన్ చేసేయండి.. అన్నీ ఈ ఒక్క ఓటీటీలోనే..
ఓటీటీలో కొన్ని ఇంట్రెస్టింగ్ తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. వాటిని ఈ వీకెండ్ చూడటానికి ప్లాన్ చేయండి. సన్ నెక్ట్స్ ఓటీటీలోనే ఈ మూవీస్ అన్నీ ఉండటం విశేషం.
ప్రేమ కథలు ఎప్పుడూ ఆదరణ పొందే జానర్. కాలంతో పాటు దీనికి థ్రిల్లింగ్ అంశాలు కూడా జోడించి కొత్తగా చూపించడం మనం చూస్తున్నాం. ప్రస్తుత ట్రెండ్లు, యువత ఆలోచనలకు తగ్గట్టుగా చాలా ప్రేమ కథలు వస్తున్నప్పటికీ, రొమాంటిక్ థ్రిల్లర్ అనే సబ్-జానర్ తమిళ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వీటిలో కొన్ని కల్ట్ క్లాసిక్లుగా నిలిచాయి. కొన్ని మరపురాని పాత్రలను కూడా అందించాయి. వీటిలో ఐదు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ సన్ నెక్ట్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
గజిని (Ghajini)
2005లో ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’ ఒక తమిళ రొమాంటిక్ థ్రిల్లర్. ఇందులో సూర్య, అసిన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తో బాధపడే ఓ వ్యాపారవేత్త తన ప్రేమికురాలి మరణానికి కారణమైన వారిని వేటాడటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ‘గజిని’ మూవీ అసిన్, సూర్య ఇద్దరికీ కెరీర్ డిఫైనింగ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను హిందీలోనూ ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ తో మురగదాసే తీశాడు.
నేసిప్పాయ (Nesippaya)
‘నేసిప్పాయ’ 2025లో విడుదలైన ఒక తమిళ రొమాంటిక్ థ్రిల్లర్. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా ఆకాష్ మురళి అరంగేట్రం చేయగా, అదితి శంకర్ కథానాయికగా నటించింది. ఒక యువ జంట చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అమ్మాయి పని కోసం పోర్చుగల్‌కు వెళ్ళగా, అక్కడ ఆమె ఒక నేరంలో చిక్కుకుంటుంది. విదేశీ గడ్డపై ఆమెను రక్షించడానికి ఆ అబ్బాయి ఏం చేస్తాడన్నదే ఈ మూవీ స్టోరీ. శరత్‌కుమార్, ప్రభు, ఖుష్బూ, కల్కి కోచ్లిన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
మైనా (Mynaa)
‘మైనా’ 2010లో వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందిన రొమాంటిక్ థ్రిల్లర్. ఇది తమిళనాడులోని గ్రామీణ, పర్వత ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విదార్థ్, అమలా పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తన చిన్ననాటి స్నేహితురాలు మైనాను ప్రేమించే ఒక ఖైదీ, పరిస్థితులు వారిద్దరినీ పోలీసుల అదుపులోకి ఎలా తీసుకెళ్తాయో వివరిస్తుంది. ‘మైనా’ కమర్షియల్ గా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మన్మధన్ (Manmadhan)
ఎ.జె. మురుగన్ దర్శకత్వం వహించిన ‘మన్మధన్’ ఒక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో శింబు ద్విపాత్రాభినయం చేశాడు. తన తమ్ముడి మరణానికి కారణమైన ఓ యువతిపై కోపంతో అతని కవల సోదరుడు అమ్మాయిలను ఆకర్షించి, వాళ్లను హత్యలు చేసే సీరియల్ కిల్లర్ గా మారతాడు. మన్మథ పేరుతో తెలుగులోనూ ఈ సినిమా వచ్చింది.
కాదల్ కొండైన్ (Kaadhal Kondein)
‘కాదల్ కొండైన్’ 2003లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్. ఇందులో ధనుష్ ఒక అనాథగా నటించాడు. అతను తన కాలేజీ క్లాస్‌మేట్‌ను ప్రేమించి, ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమె పట్ల మక్కువ పెంచుకుంటాడు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ధనుష్‌ని తమిళ సినిమాలో ఓ స్టార్ ను చేసింది. వినోద్‌గా అతని నటన ప్రశంసలు అందుకుంది. సోనియా అగర్వాల్ కథానాయికగా నటించింది.
సంబంధిత కథనం