నిమిషాల్లోనే పుట్టిన బిడ్డ మాయం.. ఒక్క యాక్సిడెంట్.. కోట్ల మాఫియా ఎలా అయింది.. ఓటీటీలోకి తెలుగులో వచ్చిన తమిళ థ్రిల్లర్

Best Web Hosting Provider In India 2024

నిమిషాల్లోనే పుట్టిన బిడ్డ మాయం.. ఒక్క యాక్సిడెంట్.. కోట్ల మాఫియా ఎలా అయింది.. ఓటీటీలోకి తెలుగులో వచ్చిన తమిళ థ్రిల్లర్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి శనివారం (జులై 19) తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ తమిళ థ్రిల్లర్ చూడాల్సిందే. ఒక్క యాక్సిడెంట్ కోట్ల మాఫియాకు ఎలా దారి తీసిందన్నది ఈ సినిమాలో చూపించిన తీరు బాగుంది. తెలుగులో థియేటర్లలో రిలీజైన ఒక రోజులోనే ఓటీటీలోకి వచ్చిన మూవీ ఇది.

నిమిషాల్లోనే పుట్టిన బిడ్డ మాయం.. ఒక్క యాక్సిడెంట్.. కోట్ల మాఫియా ఎలా అయింది.. ఓటీటీలోకి తెలుగులో వచ్చిన తమిళ థ్రిల్లర్

తమిళ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ (DNA). తెలుగులో మై బేబీ పేరుతో శుక్రవారం (జులై 18) థియేటర్లలో రిలీజైంది. అయితే శనివారం (జులై 19) నుంచే జియోహాట్‌స్టార్ లో తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది? ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించేంతలా ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చిన విషయం ఏంటన్నది ఈ రివ్యూలో చూడండి.

డీఎన్ఏ మూవీ స్టోరీ ఏంటంటే?

తమిళ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ. ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజైంది. అథర్వ, నిమిషా సజయన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ పసి బిడ్డల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. ముందుగా కథ 2014లో జరిగే ఓ యాక్సిడెంట్ తో మొదలవుతుంది. వరదరాజన్ (జీషాన్ అయ్యుబ్) అనే ఓ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్ నిద్ర మత్తులో కారు నడుపుతూ ఓ బైకును వెనుక నుంచి ఢీకొడతాడు. ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ కన్నుమూయగా.. వాళ్ల రోజుల పసిబిడ్డను రోడ్డు పక్కన గమనించిన అతడు.. హాస్పిటల్లో తన బిడ్డను కోల్పోయిన వారికి ఇస్తాడు. సీన్ అక్కడ కట్ చేస్తే 2023కు కథ చేరుతుంది.

ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా) భార్యభర్తలు. వాళ్లకు ఓ బాబు పుడతాడు. అయితే పుట్టిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే వాళ్ల బాబు మారిపోతాడు. ఆ విషయాన్ని దివ్య మాత్రమే గుర్తిస్తుంది. ఆమెకు పెళ్లికి ముందు బైపోలార్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ) ఉండటంతో ఆమె మాటలు ఎవరూ నమ్మరు.

హాస్పిటల్ వాళ్లు కూడా ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేస్తారు. తన భార్య మాటల వెనుక నిజం తెలుసుకోవడానికి ఆనంద్ డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఆ బిడ్డ తమవాడు కాదని తేలుతుంది. దీంతో అతడు కోర్టును ఆశ్రయిస్తాడు. మరోవైపు పోలీసులతో కలిసి తానే స్వయంగా అసలు ఏం జరిగిందో కనిపెట్టే పని మొదలుపెడతాడు. ఈ క్రమంలో పుట్టిన బిడ్డలను మాయం చేసే పెద్ద మాఫియా చెయిన్ వాళ్లకు ఎదురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్, దివ్యలకు తమ కొడుకు మళ్లీ దొరుకుతాడా లేదా? వాళ్ల కొడుకు స్థానంలో వేరొకరిని మార్చడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అన్నది ఈ డీఎన్ఏ సినిమాలో చూడొచ్చు.

డీఎన్ఏ మూవీ ఎలా ఉందంటే?

డీఎన్ఏ మూవీని నెల్సన్ వెంకటేశన్ డైరెక్ట్ చేశాడు. రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.10 కోట్ల వరకూ వచ్చాయి. చైల్డ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ అసలు కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకుంది. అప్పటి వరకూ ప్రేమలో విఫలమై తాగుడుకు బానిసైన హీరో, పిచ్చిదానిలా ప్రవర్తించే హీరోయిన్ పరిచయాలే చూపించారు. ఇది కాస్త విసుగుగా అనిపిస్తుంది.

అయితే ఒకసారి అసలు కథలోకి వెళ్లిన తర్వాత కథ పరుగులు పెడుతుంది. రేసీ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ అక్కడి నుంచి కథను రక్తి కట్టించాడు. అక్కడి నుంచి వరుస ట్విస్టులతో చివరి వరకూ ఆసక్తికరంగానే సాగుతుంది. సినిమా మొదట్లో జరిగే యాక్సిడెంట్ కోట్ల మాఫియాకు ఎలా కారణమవుతుందన్నదే ఈ డీఎన్ఏ మూవీలో అసలు ట్విస్ట్. థ్రిల్లర్ మూవీస్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులను ఈ డీఎన్ఏ ఆకట్టుకుంటుంది. ఈ వీకెండ్ వీలుంటే చూసేయండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024