శ్రీలీల గ్లామర్ పని చేసిందా? జూనియర్ మూవీకి మూడు రోజులు ఎన్ని కోట్లు వచ్చాయంటే? లాభాల్లోకి వెళ్లేనా?

Best Web Hosting Provider In India 2024

శ్రీలీల గ్లామర్ పని చేసిందా? జూనియర్ మూవీకి మూడు రోజులు ఎన్ని కోట్లు వచ్చాయంటే? లాభాల్లోకి వెళ్లేనా?

గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి హీరోగా లాంఛ్ అయిన మూవీ జూనియర్. జులై 18న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. హీరోయిన్ గా శ్రీలీల గ్లామర్ తో అదరగొట్టింది. మరి ఈ సినిమా మూడు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో? ఇక్కడ చూద్దాం.

జూనియర్ మూవీ పోస్టర్ (x/Vaaraahi Chalana Chitram)

కొత్త హీరో సినిమా జూనియర్ థియేటర్లలో హల్ చల్ చేస్తోంది. జూలై 18న ఈ మూవీ రిలీజైంది. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. టాలీవుడ్ బేబీ డాల్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత జెనీలియా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూనియర్ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మరి ఆ మూవీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం.

మిక్స్‌డ్ టాక్

జూనియర్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ గాలి కిరీటీ రెడ్డి సినిమాకు కలెక్షన్స్ డీసెంట్‌గా వస్తున్నాయని ట్రేండ్ పండితులు అంటున్నారు. ఈ రోజు ఆదివారం (జులై 20) కావడంతో జూనియర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మంచి బుకింగ్స్ జరిగినట్లు సాక్‌నిల్క్ వెబ్ సైట్ చెబుతోంది. సాయంత్రం 4 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 25.50 శాతం, కన్నడ వెర్షన్‌లో 23.25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. రెండో రోజు బుకింగ్స్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

మూడో రోజు

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.80 కోట్లు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 20 లక్షల రూపాయల చొప్పున జూనియర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్ల వసూళ్లు రాబడుతుందని చెబుతున్నారు. మూడు రోజుల్లో కలిపి జూనియర్ కలెక్షన్లు రూ.8 కోట్లకు చేరాయి. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.12 కోట్లు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

జూనియర్ చిత్రాన్ని రూ.25 బడ్జెట్‌‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రాఫిట్లోకి రావాలంటే రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీని 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఫస్ట్ మూవీ

జూనియర్ సినిమాలో కిరీటీ పక్కన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. జెనీలియా, రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు నటించారు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి డైరెక్టర్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా వైరల్ వయ్యారి తెగ వైరల్ అయింది. శ్రీలీల గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024