అలర్ట్​! తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు- ఇదీ కారణం..

Best Web Hosting Provider In India 2024

అలర్ట్​! తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు- ఇదీ కారణం..

Sharath Chitturi HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sharath Chitturi HT Telugu

బోనాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో, తెలంగాణవ్యాప్తంగా బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఈ నెలలో మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..

తెలంగాణ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్​! (REUTERS)

బ్యాంకు పనుల కోసం తిరిగే వారికి అలర్ట్​! తెలంగాణలో నేడు, జులై 21 అన్ని బ్యాంకులకు సెలవు. బోనాల నేపథ్యంలో జులై 21ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం ఇందుకు కారణం. ఈ రోజు బ్యాంకులతో పాటు స్కూళ్లు, కాలేజీలు సైతం మూతపడి ఉంటాయి.

బోనాల వేళ తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు..

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) జారీ చేస్తుంది. అయితే వీటిల్లో ప్రాంతీయ పండుగల వేళ ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు, జులై 21న బోనాల కారణంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఇక జులై 20 ఆదివారం వచ్చింది. ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంటే, తెలంగాణలో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు లభించాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఇక హైదరాబాద్​లోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తెలంగాణ బ్యాంకు సెలవులు..

ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులు ఇంకో రెండు రోజులు మూతపడి ఉంటాయి. జులై 26 నాలుగో శనివారం వచ్చింది. జులై 27 ఆదివారం వచ్చింది. వారంతంలో బ్యాంకులు మూతపడి ఉంటాయని కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​ సేవలు యథాతథంగా పనిచేస్తాయి..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఆన్​లైన్​ సేవలు యథాతథంగా పనిచేస్తుంటాయి. నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర హాలీడేలతో ఎలాంటి సంబంధం లేకుండా వారి ఆన్​లైన్ వెబ్​సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచుతాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంకైనా వెళ్లొచ్చు.

తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకులు తిరిగి యథాతథంగా పనిచేస్తాయి. మీరు మీ బ్యాంకు పనుల కోసం సంబంధిత బ్రాంచీలకు వెళ్లొచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

టాపిక్

BankingBank HolidaysTelangana NewsHyderabadTelugu NewsBusiness
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్‌ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024