




Best Web Hosting Provider In India 2024
టీమిండియాకు బిగ్ షాక్.. ఆ ప్లేయర్లు ఇద్దరికి గాయాలు.. ఇంటికి తెలుగు ఆల్ రౌండర్
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో 1-2తో వెనుకబడ్డ టీమిండియాకు బిగ్ షాక్. భారత జట్టు కీలక ప్లేయర్లు ఇద్దరు గాయాలపాలయ్యారు. ఇందులో తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మొత్తం సిరీస్ కే దూరమయ్యాడు. పేసర్ అర్ష్ దీప్ ఓ మ్యాచ్ ఆడటం లేదు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్. ఇప్పటికే అయిదు టెస్టుల సిరీస్ లో భారత క్రికెట్ జట్టు 1-2తో వెనుకబడి ఉంది. సిరీస్ లో ఇంకా రెండు టెస్టులున్నాయి. ఇందులో ఒక్కటి ఓడినా సిరీస్ పోయినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్ అర్ష్ దీప్ సింగ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు.
సిరీస్ మొత్తానికి
ఇండియన్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన అండర్సన్-టెండూల్కర్ సిరీస్ లోని రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. బుధవారం, జూలై 23న ప్రారంభం కానున్న మాంచెస్టర్ టెస్ట్‌కు సన్నద్ధతలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బీసీసీఐ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఎడమ మోకాలి గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్ కు దూరమయ్యాడు.
శిక్షణలో ఇంజూరీ
ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయని పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. బెకెన్‌హామ్‌లో శిక్షణ సమయంలో ఎడమ బొటనవేలుకు గాయంతో మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టుకు మిస్ అవుతాడు. “బీసీసీఐ మెడికల్ టీమ్ అర్ష్ దీప్ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది” అని బోర్డు అధికారిక ప్రకటనలో తెలిపింది. మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్ట్‌కు ముందు పురుషుల ఎంపిక కమిటీ అంశుల్ కంబోజ్‌ను జట్టులో చేర్చింది.
బ్యాలెన్సింగ్ కుదిరేనా?
సిరీస్ అంతటా భారత్ మూడు ఆల్‌రౌండర్లతో ఆడటానికి ఇష్టపడింది. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ టెస్ట్‌లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడారు. అయితే నితీశ్ గాయపడటంతో భారత జట్టు బ్యాలెన్స్ ప్రమాదంలో ఉంది. మరి మరో ఆల్ రౌండర్ ఆప్షన్ కోసం టీమిండియా ఏం చేస్తుందో చూడాలి. మరోవైపు కరుణ్ నాయర్ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్ట్‌లో వికెట్ కీపర్‌గా ఆడేందుకు సరిపడా ఫిట్‌గా లేకపోతే ధ్రువ్ జురెల్ జట్టులోకి రావచ్చు.
నాలుగో టెస్ట్‌కు భారత జట్టు జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుధర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ డీప్, కుల్దీప్ యాదవ్, అంశుల్ కంబోజ్.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link