





Best Web Hosting Provider In India 2024

మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ.. ఇండియానా జోన్స్‌ల హరి హర వీరమల్లును తీశాడు.. నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ హరి హర వీరమల్లు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. హరి హర వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు నిర్మాత ఏఎం రత్నం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు
ఇద్దరు దర్శకులు
పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమాకు ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా బాబీ డియోల్ విలన్‌గా చేశారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మూడు రోజుల్లో రిలీజ్
మరో మూడు రోజుల్లో హరి హర వీరమల్లు థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారా?
-జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ, అభిమానులు ముందు రోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము.
సినిమా ఆలస్యమైంది కదా.. పవన్ కల్యాణ్ గారి సహకారం ఎలా ఉంది?
–పవన్ కల్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. పవన్ గారంటే నాకెంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి ఇష్టం. మేకర్‌గా నన్ను గౌరవిస్తారు.
-పవన్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీం అందరూ ఎంతో సహకరించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము.
మీ కుమారుడు జ్యోతికృష్ణ గారి గురించి?
-మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతి కృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియానా జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్ కల్యాణ్ గారు కూడా ప్రశంసించారు.
సంబంధిత కథనం