ఈ వారం ఓటీటీలోకి ఒకే ఒక్క తెలుగు సినిమానా? ఆ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్పెషాలిటీ ఏంటీ? ఒకేసారి రెండు ప్లాట్‌ఫామ్‌ల్లోకి!

Best Web Hosting Provider In India 2024

ఈ వారం ఓటీటీలోకి ఒకే ఒక్క తెలుగు సినిమానా? ఆ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్పెషాలిటీ ఏంటీ? ఒకేసారి రెండు ప్లాట్‌ఫామ్‌ల్లోకి!

ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈ వారం ఓటీటీలోకి తెలుగు డైరెక్ట్ మూవీ ఒకటే రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టనుంది. ఆ మూవీ ఏదీ? ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?

ఈ వారం ఓటీటీలోకి ఒకే తెలుగు సినిమా (x/Actor Naveen Chandra)

కొత్త వారం వచ్చిందంటే సినిమాలు ఓటీటీలోకి వరుస కడుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు ఒకే ఒక్క డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షో టైమ్ (Show Time) ఓటీటీ రిలీజ్ మాత్రమే కన్ఫామ్ అయింది. మిగతా తెలుగు సినిమాలేవీ ఓటీటీ రిలీజ్ ప్రకటనలు ఏవీ చేయలేదు.

రెండు ఓటీటీల్లోకి

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన షో టైమ్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో రిలీజ్ కానుంది. జులై 25న ఈ సినిమా సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీలో నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేశాడు. రాజా రవీంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్ లాంటి వాళ్లూ నటించారు.

21 రోజుల్లోనే

షో టైమ్ మూవీ 21 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటం గమనార్హం. ఈ మూవీ జులై 4న థియేటర్లలో రిలీజైంది. ఈ నెలలోనే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇదే నెలలో డిజిటల్ ప్రీమియర్ కూ సిద్ధమవుతుండటం విశేషం. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఓ డిఫరెంట్ స్టోరీతో వచ్చినా స్క్రీన్‌ప్లే దెబ్బ తీసిందంటూ రివ్యూలు వచ్చాయి.

షో టైమ్ మూవీ గురించి..

షో టైమ్ మూవీని మదన్ దక్షిణామూర్తి డైరెక్ట్ చేశాడు. ఇందులో నవీన్ చంద్ర, రాజా రవీంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో నవీన్ చంద్ర నటించాడు. అతని భార్య శాంతి పాత్రలో కామాక్షి, లక్ష్మీకాంత్ అనే సీఐ పాత్రలో రాజా రవీంద్ర, లాయర్ వరదరాజులు పాత్రలో నరేష్ కనిపించారు.

ఈ సినిమా సూర్య, శాంతి, లక్ష్మీకాంత్ చుట్టూ తిరుగుతుంది. ఓ హత్య వీళ్ల జీవితాలను ఎలా మార్చేస్తుందన్నదే మూవీ కథ. సూర్య, లక్ష్మీకాంత్ మధ్య ఉన్న ఈగో సమస్యలు ఆ కుటుంబాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ క్రైమ్ నుంచి వాళ్లు తప్పించుకుంటారా లేదా అన్నదే షో టైమ్ మూవీ స్టోరీ.

ఈ సినిమా జులై 4న థియేటర్లలో రిలీజైంది. అయితే ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో మూడు వారాల్లోనే సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వస్తోంది. జులై 25 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024