




Best Web Hosting Provider In India 2024
ఐబీపీఎస్ నుంచి బిగ్ అప్డేట్! పీఓ- ఎస్ఓ రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ డేట్ పొడిగింపు..
ఐబీపీఎస్ కీలక ప్రకటన చేసింది. పీఓ, ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 28 వరకు పొడిగించినట్టు వెల్లడించింది. రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పీఓ, ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు గడువును పొడిగించింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్). ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి జులై 28, 2025 చివరి తేదీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inలో రిజిస్ట్రేషన్ లింక్‌ను పొందవచ్చు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 5208 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పీఓ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఓ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్ 2025- ఇలా అప్లై చేసుకోండి..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు క్రింది దశలను అనుసరించవచ్చు:
స్టెప్ 1- ముందుగా, ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే ఐబీపీఎస్ పీఓ లేదా ఐబీపీఎస్ ఎస్ఓ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఐబీపీఎస్ పీఓ 2025 ఎగ్జామ్ పాటర్న్‌లో భారీ మార్పులు- పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
స్టెప్ 3- ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు ‘అప్లై ఆన్‌లైన్’ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4- రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 6- దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, దరఖాస్తు రుసుమును చెల్లించండి.
స్టెప్ 7- ‘సబ్మిట్’పై క్లిక్ చేసి, ఆ తర్వాత పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 8- భవిష్యత్ అవసరాల కోసం దాని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.
ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్ 2025- దరఖాస్తు రుసుము..
ఇతర కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850/- కాగా, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175/- ఈ చెల్లింపును ఆన్‌లైన్ విధానంలో చేయవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్ రెండు పోస్టులకూ ప్రిలిమినరీ పరీక్ష, ఆ తర్వాత మెయిన్ పరీక్ష ఉంటాయి. మరింత సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link