లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై ముగిసిన వాదనలు!

Best Web Hosting Provider In India 2024

లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై ముగిసిన వాదనలు!

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మిథున్ రెడ్డి పిటిషన్లపై అభ్యంతరాలుంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.

ఎంపీ మిథున్ రెడ్డి (ఫైల్ ఫొటో)

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని దాఖలైన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణలను ముగించింది. విచారణ సందర్భంగా ఎంపీకి కల్పించే సౌకర్యాల గురించి కోర్టు జైళ్ల శాఖ అధికారులను ప్రశ్నించింది. అవసరమైన నిబంధనలు పాటిస్తున్నామని అంగీకరిస్తూ అధికారులు సానుకూలంగా స్పందించారు.

మిథున్ రెడ్డి పిటిషన్లపై అభ్యంతరాలుంటే నేరుగా కోర్టుకు హాజరై చెప్పాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో అధికారి కోర్టుకు హాజరు అయ్యారు. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అయితే ఇంటి నుంచి ఆహారం అనుమతించాలంటే అండర్ టేకింగ్ లెటర్ అవసరమని చెప్పారు.

ఎంపీ మిథన్ రెడ్డి తన పిటిషన్ ద్వారా అనేక సౌకర్యాలను అభ్యర్థించారు. టీవీ, మంచం, వెస్ట్రన్ కమోడ్, ఇంటి నుండి రోజుకు మూడుపూటల భోజనం, సోఫా, దోమతెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్తాపత్రికలు, అలాగే వారానికి ఐదు రోజులు సూపర్‌వైజర్, ఇద్దరు న్యాయవాదులతో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించే అవకాశాన్ని కల్పించాలని కోరారు. అంతేకాకుండా నోట్‌బుక్‌లు, పెన్నులు ఇప్పించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

LiquorLiquor ScamYsrcpAcbAcb Court
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024