బ్రహ్మముడి జులై 23 ఎపిసోడ్: ఇంటికి వచ్చేసిన రేవతి.. అపర్ణ షాక్.. రాజ్, కావ్య ప్లాన్ సక్సెస్.. రుద్రాణి కొత్త ప్లాన్

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జులై 23 ఎపిసోడ్: ఇంటికి వచ్చేసిన రేవతి.. అపర్ణ షాక్.. రాజ్, కావ్య ప్లాన్ సక్సెస్.. రుద్రాణి కొత్త ప్లాన్

Hari Prasad S HT Telugu

స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి బుధవారం (జులై 23) ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగింది. రేవతిని ఇంటికి రప్పించడానికి రాజ్, కావ్య నాటకం.. అటు ఆమెను ఇంటికి రాకుండా అడ్డుకోవడానికి రుద్రాణి కొత్త ప్లాన్.. ఇలా ట్విస్టులతో సాగిపోయింది.

బ్రహ్మముడి జులై 23 ఎపిసోడ్: ఇంటికి వచ్చేసిన రేవతి.. అపర్ణ షాక్.. రాజ్, కావ్య ప్లాన్ సక్సెస్.. రుద్రాణి కొత్త ప్లాన్

బ్రహ్మముడి సీరియల్ 781వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా సాగింది. రేవతి గురించి రాజ్ తెలుసుకోవడం, ఆమెను రప్పించడానికి కావ్యతో కలిసి నాటకమాడటం, అటు రేవతి ఇంటికి రుద్రాణి, రాహుల్ వెళ్లడం, వాళ్ల ముందే తల్లి అపర్ణతో ఆమె మాట్లాడటంలాంటి ట్విస్టులు ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

రేవతి గురించి తెలుసుకున్న రాజ్

బ్రహ్మముడి సీరియల్ కావ్య ఆందోళన చెందుతూ ఏదో ఆలోచిస్తున్న సీన్ తో బుధవారం (జులై 23) ఎపిసోడ్ మొదలైంది. ఆమె దగ్గరకు వచ్చిన రాజ్.. అంతా బాగా జరిగినప్పుడు మళ్లీ ఎందుకు పాత వాటి గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నావని అడుగుతాడు. అప్పుడు రాజ్ కు రేవతి గురించి చెబుతుంది కావ్య.

ఆమె జగదీశ్ ను పెళ్లి చేసుకోవడం, ఇంట్లో నుంచి వాళ్లను వెళ్లగొట్టడం గురించి రాజ్ తెలుసుకుంటాడు. ఆమె ఎవరో తెలియకపోయినా అక్కా అని తాను పిలిచానని, ఆ దేవుడే అలా అనిపించాడా అని రాజ్ అంటాడు. అపర్ణ, రేవతిని ఎలా కలపాలో అర్థం కావడం లేదని కావ్య అనగానే.. దానికి ఓ ప్లాన్ చెబుతాను ఫాలో అవండి అని రాజ్ అంటాడు.

రేవతి ఇంటికి రుద్రాణి, రాహుల్

అటు జగదీశ్ ను ఫాలో చేస్తూ రేవతి ఇంటికి వెళ్తుంది రుద్రాణి. అసలు ఆమె ఎక్కడో దూరంగా బతుకుతుందని అనుకున్నానని, ఇక్కడే ఉండటంతో ఆందోళన చెందుతుంది. ఇంటికి వచ్చిన జగదీశ్ కు రేవతి జరిగిన విషయం చెబుతుంది. తమ కొడుకుని అమ్మమ్మ అపర్ణ ఎలా దగ్గరకి తీసుకుంది? ఎలా ఆప్యాయంగా మాట్లాడింది అతనికి చెబుతుంది. దీంతో జగదీశ్ కూడా ఆశ్చర్యపోతాడు. అది విని రుద్రాణి, రాహుల్ షాక్ తింటారు.

రాజ్, కావ్య కొత్త నాటకం

ఇటు రేవతిని ఇంటికి రప్పించడానికి రాజ్, కావ్య కొత్త నాటకం మొదలు పెడతారు. అపర్ణ ఇంటికి రాగానే ఆమె ముందే గొడవ పడుతున్నట్లు నాటకమాడతారు. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని గొడవ పడుతుంటారు. దీంతో అపర్ణ వచ్చి ఎందుకు గొడవ పడుతున్నారని అడుగుతుంది. మొన్న మమ్మల్ని ఒకావిడ కాపాడింది కదా.. ఆమెను రేపు స్వప్నక్క కూతురి బర్త్ డేకు పిలుద్దామని అనుకున్నానని కావ్య చెబుతుంది. ఏదో సాయం చేసింది కదా అని ఇంట్లో ఫంక్షన్లకు పిలిచేస్తారా అని రాజ్ అంటాడు. దీనికి అపర్ణ స్పందిస్తూ.. కావ్యనే కరెక్ట్, ఆమెను పిలవండి అని అంటుంది.

రేవతికి అపర్ణ ఫోన్

దీంతో రాజ్ మాట్లాడుతూ.. మీరూ మీరూ ఒకటే అని దెప్పి పొడుస్తూ అంటాడు. తానే ఆవిడకు ఫోన్ చేసి మాట్లాడతానని అపర్ణ అంటుంది. దీంతో కావ్య రేవతికి ఫోన్ చేస్తుంది. ఆవిడ పేరేంటని అపర్ణ అడిగితే.. కాసేపు ఆలోచించి రేవతి అని చెబుతుంది. దీంతో అపర్ణ ముఖంలో గత జ్ఞాపకాలు మెదులుతున్నట్లుగా అనిపిస్తుంది.

అటు రేవతి ఫోన్ ఎత్తగానే చెప్పండి కళావతి గారు అని అంటుంది. తాను కావ్య అత్త అపర్ణ మాట్లాడుతున్నానని అనగానే రేవతి ఎమోషనల్ అవుతుంది. తమ ఇంట్లో బర్త్ డే ఉందని, కచ్చితంగా రావాలని అంటుంది. ఇదంతా అక్కడే ఉన్న రుద్రాణి, రాహుల్ వింటూ ఉంటారు.

రేవతిని ఒప్పించిన జగదీశ్

తల్లి అపర్ణ ఫోన్ చేసిన సంతోషం ఉన్నా.. ఇంటికి వెళ్లాలంటే రేవతి భయపడుతుంది. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. దీంతో జగదీశే ఆమెకు నచ్చజెబుతాడు. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుందని, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని అంటాడు. నువ్వు పిలుస్తేనే నేను మళ్లీ ఇంటికి వస్తానని గతంలో రేవతి తన తల్లి అపర్ణతో చెప్పిన మాటను జగదీశ్ గుర్తు చేస్తాడు. దీంతో రేవతి ఆలోచనలో పడుతుంది.

రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్

అటు ఇంటికి వచ్చేందుకు రేవతి సిద్ధమవుతుండటంతో రుద్రాణి, రాహుల్ ఆందోళన చెందుతారు. ఆమెను రాకుండా అడ్డుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తుంది రుద్రాణి. కారులో ఇంటికి వెళ్తూ.. ఒకవేళ రేవతి ఇంటికి వచ్చిందంటే ఆమెను చూసి అపర్ణ కరిగిపోతుందని, అదే జరిగితే మనకు ఆస్తి ఏమీ మిగలదని రాహుల్ అంటాడు. దీనికి రుద్రాణి స్పందిస్తూ.. ఇదంతా కావ్య పనే అయి ఉంటుందని అంటుంది. తాను అలా జరగనివ్వనని, అయితే ముందుగా రేవతి గురించి అపర్ణ ఏమనుకుంటుందో తెలుసుకుందామని చెబుతుంది. అటు రేవతి ఇంటికి వస్తుండటంతో కావ్య ఏం జరగుతుందో అని ఆందోళన చెందుతుండగా ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇంటికి వచ్చిన రేవతి

ఎపిసోడ్ చివర్లో వచ్చిన రేపటి ఎపిసోడ్ ప్రమో మరింత ఆసక్తి రేపుతోంది. అందరూ కేక్ కటింగ్ కోసం సిద్ధంగా ఉండగా.. కాసుపు ఆగుదామని కావ్య అంటుంది. ఇంకా ఎవరు రావాలని అపర్ణ అడిగితే.. రేవతి గారు రావాలని చెబుతుంది. ఇంతలోనే రేవతి ఇంటి ముందు ఆటోలో దిగుతుంది. ఆమెను చూడగానే అపర్ణతోపాటు ఇంట్లోని వాళ్లు షాక్ తినడం ఇందులో చూడొచ్చు. దీంతో రేపటి ఎపిసోడ్ ఎలా సాగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024