ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌, సినిమాలను చూశారా? నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సిరీస్.. ఇక్కడ చూసేయండి

Best Web Hosting Provider In India 2024

ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌, సినిమాలను చూశారా? నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సిరీస్.. ఇక్కడ చూసేయండి

Hari Prasad S HT Telugu

ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లోకి మండల మర్డర్స్ అనే మరో సిరీస్ కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓటీటీల్లో ఉన్న ఇలాంటి టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌, సినిమాలను చూశారా? నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సిరీస్.. ఇక్కడ చూసేయండి

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ వారం మండల మర్డర్స్ పేరుతో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి వాణీ కపూర్ నటించిన ఈ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, శ్రియ పిల్గావ్‌కర్ తదితరులు కూడా నటించారు. ఈ సిరీస్, మండల ప్రాంతంలో జరుగుతున్న హత్యలు, వాటి వెనుక దాగి ఉన్న లోతైన రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఒక రహస్య సమాజం, ఆచారాలు, బలులు ఈ సిరీస్‌కు ప్రధాన ఇతివృత్తాలు కావడంతో దీనిపై చాలా ఆసక్తి నెలకొంది.

అయితే, ఇటీవల మనల్ని ఆకట్టుకున్న ఏకైక సిరీస్ ‘మండల మర్డర్స్’ మాత్రమే కాదు. పంకజ్ త్రిపాఠి నటించిన ‘క్రిమినల్ జస్టిస్‘, దిల్‌జిత్ దోసాంజ్ నటించిన ‘డిటెక్టివ్ షేర్‌దిల్’ వంటి మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా కొన్ని ప్రత్యేక కారణాలతో మన దృష్టిని ఆకర్షించాయి. మరి ఆ మర్డర్ మిస్టరీ ప్రాజెక్ట్‌లు ఏవి, ఎక్కడ చూడాలో తెలుసుకోండి. వీటిని ఓటీటీప్లే ప్రీమియం ద్వారా కూడా చూడొచ్చు.

క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మ్యాటర్ – జియోహాట్‌స్టార్

‘క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మ్యాటర్’ పంకజ్ త్రిపాఠిని మాధవ్ మిశ్రా పాత్రలో తిరిగి తీసుకువచ్చింది. ఇది అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ లలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సీజన్ బాగా ఆదరణ పొందింది. ఇటీవల విడుదలైన కేకే మీనన్ ‘స్పెషల్ ఆప్స్ 2‘తో పోటీ పడుతోంది. ఈ సిరీస్ హత్య నేపథ్యంలో ప్రారంభమైంది. ఇక ముగింపు అయితే చాలా మందిని ఆకర్షించింది.

ఛల్ కపట్ – జీ5 ఓటీటీ

శ్రియ పిల్గావ్‌కర్ నటించిన ‘ఛల్ కపట్‘ ఆమెను మొదటిసారి ఒక పోలీసు పాత్రలో చూపింది. ఈ సిరీస్ కూడా ఒక హత్యతోనే మొదలవుతుంది. ఇందులో తొమ్మిది మంది అనుమానితులు ఉంటారు. కేసు మొత్తం మోసం చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది.

డిటెక్టివ్ షేర్‌దిల్ – జీ5 ఓటీటీ

దిల్‌జిత్ దోసాంజ్ మూవీ ‘డిటెక్టివ్ షేర్‌దిల్’ కూడా ఒక హత్యతో ప్రారంభమవుతుంది. అయితే, ఇది ఒక ధనవంతుడికి సంబంధించిన కేసు కావడంతో.. ఈ కేసు పైకి కనిపించినంత సులభంగా ఉండదు. దిల్‌జిత్ ఒక ప్రత్యేకమైన డిటెక్టివ్‌గా చేసిన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇది అతని సినిమా ‘సర్దార్ జీ 3’ విడుదల కంటే ముందే వచ్చింది.

36 డేస్ – సోనీ లివ్

చిరుత మూవీ బ్యూటీ నేహా శర్మ నటించిన ’36 డేస్’ కొంతకాలం కిందట చాలా చర్చనీయాంశమైంది. తన పొరుగిళ్లలో ఉండే ప్రతి మగాడిని ఆకర్షించే ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అయితే అకస్మాత్తుగా ఒక హత్య జరుగుతుంది. అందులో ఆమె ప్రధాన అనుమానితురాలు అవుతుంది. మరి ఆమె నిజంగానే ఆ హత్య చేసిందా? లేదా అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

హనీమూన్ ఫోటోగ్రాఫర్ – సోనీ లివ్

ఒక జంట హనీమూన్ ఫోటోగ్రాఫర్‌ను నియమించుకుంటుంది. ఆ తర్వాత భర్త చనిపోతాడు. ఈ రహస్యం బయటకు వచ్చే కొద్దీ, ఒక పెద్ద ఆధారం బయటపడుతుంది. అతను నియమించుకున్న హనీమూన్ ఫోటోగ్రాఫర్ వాస్తవానికి అతని మాజీ ప్రేమికురాలు అని. ఈ విషయం మరింత సంక్లిష్టంగా మారుతుంది. హనీమూన్ ఫోటోగ్రాఫర్ హత్య కేసులో ప్రధాన అనుమానితురాలు అవుతుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024