


ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.12-9-2022(సోమవారం) ..
జగనన్న కాలనీ లబ్ధిదారుడి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ది ..
నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామంలో జగనన్న కాలనీ లో నూతనంగా ఇల్లు నిర్మించుకునే లబ్దిదారుడి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు వారికి శుభాకాంక్షలు తెలిపారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కొన్ని లక్షల మంది పేద వాళ్లకు ఆయా గ్రామాల్లోనే ఉచితంగా ఇళ్ల స్థలాలు – పట్టాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు ,ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేయడమే కాకుండా లబ్ధిదారులు ఆ యా స్థలాలలో ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకొని వేగవంతంగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యే విధంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందిస్తూ ,అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు , సొంత ఇల్లు లేని పేద వాళ్ళు ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని ,పేద వాళ్ళ సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు ..
ఈ కార్యక్రమంలో అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునురు కొండారెడ్డి ,గ్రామ సర్పంచ్ ఐలపోగు రమాదేవి,ఎంపీపీ సుందరమ్మ ,వైస్ ఎంపీపీ అన్నం పిచ్చయ్య ,మండల పార్టీ అధ్యక్షులు శివ నాగేశ్వరరావు ,హౌసింగ్ అధికారులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..