ఏ వయసులో మనం వృద్ధాప్యంలోకి అడుగుపెడతాం? కొత్త పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు

Best Web Hosting Provider In India 2024

ఏ వయసులో మనం వృద్ధాప్యంలోకి అడుగుపెడతాం? కొత్త పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు

HT Telugu Desk HT Telugu

వృద్ధాప్యం ఎప్పుడు మొదలవుతుంది? చాలామంది దీన్ని 60 లేదా 70 ఏళ్ల వయసులో అని అనుకుంటారు. కానీ ఒక కొత్త పరిశోధనలో దీనిపై ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

ఏ వయసులో మనం వృద్ధాప్యంలోకి అడుగుపెడతాం? కొత్త పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు (Pexels)

వృద్ధాప్యం ఎప్పుడు మొదలవుతుంది? చాలామంది దీన్ని 60 లేదా 70 ఏళ్ల వయసులో అని అనుకుంటారు. కానీ ఒక కొత్త పరిశోధనలో దీనిపై ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. చైనాలో సుమారు 70 మంది వ్యక్తుల కణజాలంపై (14 నుంచి 68 ఏళ్ల వయసు వారిపై) శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ పరిశోధన వివరాలు ‘సెల్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో తేలిన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి.

వృద్ధాప్య ప్రక్రియ ఎప్పుడు వేగవంతం అవుతుంది?

పరిశోధన ప్రకారం, వృద్ధాప్య ప్రక్రియ 45 నుంచి 55 ఏళ్ల మధ్య వేగవంతం అవుతుంది. కణాల్లో mRNA సూచనల ద్వారా ఏర్పడే ప్రొటీన్లు, వయసు పెరిగే కొద్దీ సరిగ్గా ఏర్పడటం తగ్గుతుంది. ఇది వృద్ధాప్యం ప్రారంభానికి సంకేతం.

శాస్త్రవేత్తలు గుండె, కాలేయం, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, చర్మం, కండరాలతో సహా శరీరంలోని చాలా అవయవాలను పరీక్షించారు. ఒక్కో అవయవం ఒక్కో వేగంతో వృద్ధాప్యంలోకి వెళ్తుందని కనుగొన్నారు.

కొన్ని అవయవాలు త్వరగా ముసలివవుతాయి. స్ప్లీన్ (ప్లీహం), అడ్రినల్ గ్రంధి, బృహద్ధమని (aorta) వంటి అవయవాలు 30 ఏళ్ల వయసు నుంచే వృద్ధాప్య లక్షణాలు చూపించాయి. ముఖ్యంగా, 45 నుంచి 55 ఏళ్ల మధ్యలో బృహద్ధమనిలో ప్రొటీన్ స్థాయిలలో పెద్ద మార్పులు కనిపించాయి.

మంచి అలవాట్లు ఆరోగ్యకరమైన జీవితాన్నిస్తాయి

న్యూయార్క్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ నెవిల్లే సంజన మాట్లాడుతూ… “ఈ పరిశోధన అవయవాల వృద్ధాప్యంపై ఒక అందమైన రోడ్‌మ్యాప్‌ను ఇస్తుంది” అని అన్నారు.

ఈ పరిశోధనలు వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు కొత్త చికిత్సలను కనుగొనడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్సల వల్ల ప్రజలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలరని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ మెడికల్ బ్రాంచ్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ బ్లాక్‌వెల్ మాట్లాడుతూ.. “మనిషి తన జీవితంలో 45 నుంచి 50 ఏళ్ల మధ్య తీసుకునే చిన్నపాటి నిర్ణయాలు, జీవనశైలి మార్పులు మరో పదేళ్లు ఆరోగ్యంగా బతికేలా చేయగలవు” అని చెప్పారు.

మంచి ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటం, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం, తక్కువగా మద్యం సేవించడం వంటి చిన్నపాటి మార్పులు చాలా సహాయపడతాయి అని ఆయన సూచించారు. ఈ అధ్యయనం సెల్ స్థాయిలో ఈ వాస్తవాన్ని నిజం చేసిందని బ్లాక్‌వెల్ అన్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024