వాట్ ఏ సీన్.. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ హగ్.. అల్లు అరవింద్ ఇంటికి పవర్ స్టార్

Best Web Hosting Provider In India 2024

వాట్ ఏ సీన్.. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ హగ్.. అల్లు అరవింద్ ఇంటికి పవర్ స్టార్

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాల కారణంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరిగింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ లా పరిస్థితి మారింది. కానీ ఇవాళ అల్లు అర్జున్ ను పవన్ హత్తుకోవడం వైరల్ గా మారింది.

అల్లు అరవింద్, అల్లు అర్జున్ తో పవన్ కల్యాణ్

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ కు, జనసేన పార్టీకి సపోర్ట్ చేసింది. కానీ అందుకు విరుద్ధంగా అల్లు అర్జున్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డికి సపోర్ట్ గా ఇంటికి వెళ్లడం కలకలం రేపింది. దీంతో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ విరచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ హత్తుకోవడం, ఒక్క దగ్గర కనిపించడం వైరల్ గా మారింది.

అమ్మమ్మ మరణం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఆయన కుటుంబం ప్రస్తుతం తమ తల్లి అల్లు కనకరత్నం మరణం బాధలో ఉన్నారు. అల్లు అర్జున్ కు ఆమె నానమ్మ. చిరంజీవి భార్య సురేఖకు అమ్మ. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 31) అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు పవన్ కల్యాణ్. శనివారం తెల్లవారుజామును అల్లు కనకరత్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కానీ విశాఖపట్నంలో అఫీషియల్ ప్రోగ్రామ్ కారణంగా పవన్ కల్యాణ్ అంత్యక్రియలకు హాజరవలేదు.

సంతాపం తెలిపేందుకు

అల్లు కనకరత్నం మరణానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. ఆయన విషాదంలో ఉన్న అల్లు అర్జున్‌ను హత్తుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కనిపించారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో తెల్లని కుర్తా-పైజామా ధరించిన పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను హత్తుకుంటున్న దృశ్యం కనిపిస్తోంది.

విషాదంలో ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఆయనను తన నానమ్మ ఫోటో దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడ పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన అల్లు అరవింద్‌ను కలిసి, ఆయనను హత్తుకుని కొంత సేపు మాట్లాడాడు.

పాడె మోసిన చిరంజీవి

అల్లు కనకరత్నం అంత్యక్రియల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవితో కలిసి పాడె మోసిన సంగతి తెలిసిందే. కనకరత్నం శనివారం తెల్లవారుజామున వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో 94 ఏళ్ల వయసులో మరణించారు. ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ ఈ వార్త వినగానే హైదరాబాద్‌కు వచ్చాడు. రామ్ చరణ్ కూడా మైసూరులోని పెద్ది షూటింగ్ నుండి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి సంతాపం తెలిపాడు.

చిరంజీవి తన అత్తయ్య మరణ వార్తను ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌లో ధృవీకరించారు. ఆ తర్వాత జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చిరంజీవి తన అత్తయ్య కళ్ళను దానం చేశారని, తద్వారా ఆమె చివరి కోరికను నెరవేర్చారని వెల్లడించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024