ఇన్‌స్టాగ్రామ్ సర్వే, వచ్చిన రివ్యూస్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి.. అర్జున్ చక్రవర్తి నిర్మాత శ్రీని గుబ్బల కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

ఇన్‌స్టాగ్రామ్ సర్వే, వచ్చిన రివ్యూస్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి.. అర్జున్ చక్రవర్తి నిర్మాత శ్రీని గుబ్బల కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

తెలుగులో బయోపిక్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన సినిమా అర్జున్ చక్రవర్తి. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ రామరాజు, సిజా రోజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీని గుబ్బల నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 29న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ నిర్వహించారు మేకర్స్.

ఇన్‌స్టాగ్రామ్ సర్వే, వచ్చిన రివ్యూస్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి.. అర్జున్ చక్రవర్తి నిర్మాత శ్రీని గుబ్బల కామెంట్స్

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘అర్జున్ చక్రవర్తి‘. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.

అర్జున్ చక్రవర్తి థ్యాంక్ యూ మీట్

ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను అర్జున్ చక్రవర్తి సినిమా పొందింది. అలాగే, ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ అర్జున్ చక్రవర్తి థాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర, నిర్మాత శ్రీని గుబ్బల ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. చాలా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇంకా చాలామంది సినిమా చూడలేదు. తప్పకుండా ఈ సినిమా చూడాలని, మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే

“మీ అందరూ ప్రోత్సహిస్తేనే, ప్రేక్షకులు ఆదరిస్తేనే మా అందరికీ మరో సినిమా తీయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది. ప్రేక్షకులు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే ఇలాంటి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి. సినిమాకి అద్భుతమైన రివ్యూస్ ఇచ్చిన మీడియా వారందరికీ ధన్యవాదాలు” అని దర్శకుడు విక్రాంత్ తెలిపారు.

“మా నిర్మాత శ్రీని గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమాలు తీశారు. మా టీం లేకపోతే ఈ సినిమా ముందుకు వచ్చేది కాదు. టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా హీరో గురించి, మా నిర్మాత గురించి చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు” అని విక్రాంత్ రుద్ర చెప్పారు.

ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది

విజయ్ ఆరేళ్లపాటు ఈ సినిమాకి డెడికేటెడ్‌గా కష్టపడి పనిచేశారు. తప్పకుండా సినిమా చూడండి. దయానంద్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది హీరోయిన్ సిజా రోజ్. చాలా అద్భుతంగా నటించింది” అని విక్రాంత్ రుద్ర అన్నారు.

“మాకు సపోర్ట్ చేసిన హను రాఘవపూడి గారికి, వెట్రిమారన్ గారికి, అడవి శేష్ గారికి, సంపత్ నంది గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అందరూ ఈ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను” అని డైరెక్టర్ విక్రాంత్ రుద్ర కోరారు.

ఇన్‌స్టాగ్రామ్ సర్వేకు

నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, మేము ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన సర్వే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాను” అని అన్నారు.

అర్జున్ చక్రవర్తి మూవీ థాంక్ యూ మీట్‌
అర్జున్ చక్రవర్తి మూవీ థాంక్ యూ మీట్‌

“యుఎస్‌లో, ఇండియాలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని అర్జున్ చక్రవర్తి నిర్మాత శ్రీని గుబ్బల పేర్కొన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024