ఈవారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు, కన్నడ, మలయాళం టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

Best Web Hosting Provider In India 2024

ఈవారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు, కన్నడ, మలయాళం టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఈవారం తెలుగుతోపాటు కన్నడ, మలయాళం భాషలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు, సిరీస్ రానున్నాయో ఒకసారి చూద్దాం.

ఈవారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు, కన్నడ, మలయాళం టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

ఓటీటీలోకి ఈ వారం తెలుగుకు సంబంధించి ముఖ్యమైన సినిమాలు, షో వస్తున్నాయి. కన్నప్ప మూవీతోపాటు బిగ్ బాస్ 9 తెలుగు కూడా ఈవారమే ప్రారంభం కానుంది. దీంతోపాటు కన్నడ, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీల్లోకి ఈ కొత్త కంటెంట్ రాబోతోంది. మరి అవేంటో ఒకసారి చూద్దాం.

కన్నప్ప – అమెజాన్ ప్రైమ్ వీడియో

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటించిన కన్నప్ప సినిమా అతని డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ సినిమా ఒక నాస్తికుడు ఎలా శివ భక్తుడిగా మారుతాడో చూపిస్తుంది. సినిమా హైలైట్స్‌లో ఒకటి ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ల క్యామియోలు. ప్రీతి ముకుందన్ కూడా ‘కన్నప్ప’లో ఫీమేల్ లీడ్‌గా నటించింది. సినిమా ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (సెప్టెంబర్ 4) వస్తుంది. ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రైబర్స్ కూడా ఒక టాప్-అప్ ఆప్షన్‌తో చూడొచ్చు.

బిగ్ బాస్ 9 తెలుగు – జియోహాట్‌స్టార్

పాపులర్ స్టార్ నాగార్జున అక్కినేని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి హోస్ట్ గా తిరిగి వస్తున్నాడు. ‘రణరంగం’ అనే పేరుతో ఈ తెలుగు రియాలిటీ షో ఈసారి సరికొత్తగా రాబోతోంది. ఈసారి సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా షోలోకి రానున్నారు. ఈ రియాల్టీ షో 9వ సీజన్ ఆసక్తి రేపుతోంది. ఆదివారం (సెప్టెంబర్ 7) నుంచి ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుంది.

కమ్మట్టం – జీ5 ఓటీటీ

యాక్టర్ సుదేవ్ నాయర్ లీడ్ రోల్లో ఉన్న ఈ మలయాళ వెబ్ సిరీస్ కమ్మట్టం. త్రిస్సూర్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తీసింది. షాన్ తులసిధరన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ కేవలం 11 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక ఫైనాన్షియల్ స్కామ్, ఒక మిస్టరీయస్ మరణం ఈ థ్రిల్లర్ సిరీస్ కథాంశం. జీ5 ఓటీటీలో శుక్రవారం (సెప్టెంబర్ 5) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఫుటేజ్ – సన్ నెక్ట్స్ ఓటీటీ

మలయాళం మూవీ ఫుటేజ్. ఇదొక ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్ లో వచ్చిన తొలి మలయాళం సినిమా. ఇందులో మంజు వారియర్ తో పాటు విశాక్ నాయర్, గాయత్రి అశోక్ నటించారు. వ్లాగర్స్ అయిన ఓ జంట.. తమ పొరిగింట్లో ఉన్న ఓ మిస్టీరియస్ మహిళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎడిటర్ సైజు శ్రీధరన్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 5) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

సు ఫ్రమ్ సో – జియోహాట్‌స్టార్

పాపులర్ కన్నడ సినిమా ‘సు ఫ్రమ్ సో’ కర్ణాటకలోనే కాకుండా కేరళలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సులోచన ఫ్రమ్ సోమేశ్వర అనేది ఈ మూవీ పేరు. ఈ సినిమా కథ ప్రసాద్ అనే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక విచిత్రమైన ఐడియాతో ముందుకు వస్తాడు. అతనితోపాటు పక్క ఊరు నుంచి ఓ ఆత్మ కూడా వచ్చిందని ఆ ఊళ్లో వాళ్లు నమ్మడంతో అసలు కష్టాలు మొదలవుతాయి. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 5) నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024