Pushpa Actor Jagadeesh : ప్రేమించిన యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా, అందుకే ఫొటోలు తీసి బెదిరించా?

Best Web Hosting Provider In India 2024

Pushpa Actor Jagadeesh : ఓ యువతి ఆత్మహత్య కేసులో పుష్ప సినిమా నటుడు ప్రతాప్ అలియాస్ జగదీశ్ ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా జగదీశ్ ను పోలీసులు రెండ్రోజుల కస్టడీలో తీసుకున్నారు. పోలీసుల విచారణ జగదీశ్ పలు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. పుష్ప సినిమాలో అల్లు అర్జున పక్కన మచ్చా క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న జగదీశ్.. అనూహ్యంగా కేసులో ఇరుక్కున్నాడు. ఓ యువతి ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జగదీశ్ అరెస్టు అయ్యాడు.

 

ట్రెండింగ్ వార్తలు

ప్రేమించిన యువతి మరో యువకుడితో సన్నిహితంగా

గతంలో తనతో క్లోజ్ ఉన్న యువతి మరొకరికి దగ్గరవడం భరించలేక తాను బెదిరింపులకు పాల్పడినట్లు జగదీశ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతిని మళ్లీ తన దారిలోకి తెచ్చుకునేందుకు తాను ఇలా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చిన జగదీశ్‌కు ఒక యువతితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది, వీరిద్దరూ శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే జగదీశ్ కు పుష్ప సినిమాతో మంచి గుర్తింపు వచ్చి సినిమా అవకాశాలు పెరిగాయి. దీంతో జగదీశ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతడి తీరు నచ్చని యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుంది.

తన దారిలోకి తెచ్చుకునేందుకు బెదిరింపులు

తనను కాదని, మరో యువకుడికి దగ్గరైన యువతిని మళ్లీ తన దారిలోకి తెచ్చుకోవాలని జగదీశ్‌ భావించాడు. ఈ క్రమంలో గత నెల 27న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి ఇంటికి వెళ్లాడు జగదీశ్. ఆ సమయంలో యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసి వారి ఫొటోలను తీశాడు. ఆ ఫొటోను యువతికి పంపి తన మాట వినకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి గత నెల 29న తన రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సినీ నటుడు జగదీశ్‌ బెదిరింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడికి రిమాండు విధించింది. పోలీసుల కస్టడీలో నిందితుడు జగదీశ్ నేరం ఒప్పుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని తిరిగి రిమాండ్ కు తరలించారు. 

 
WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *