

కంచికచర్ల మండలం పాత్రికేయులకు నివేశన స్థలాలు మంజూరు చేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు.
శుక్రవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి కంచికచర్ల పాత్రికేయులు కలెక్టర్ ఢిల్లీ రావు ను కలిశారు. దశాబ్దాల కాలంగా కంచికచర్ల పాత్రికేయులు నివేశన స్థలాల కోసం నాయకులు చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప కార్యరూపం దాల్చలేదని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పాత్రికేయుల చిరకాల వాంఛ అయిన నివేశన స్థలాల సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా అరుణ్ కుమార్ కలెక్టర్ ను కోరారు. పాత్రికేయులకు నివేశన స్థలాలు మంజూరు చేయాల్సిన ఆవశ్యకతను సుదీర్ఘంగా ఎమ్మెల్సీ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ తన దృష్టికి తీసుకు వచ్చిన పాత్రికేయుల .సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తక్షణం సంబంధిత ఫైల్ను తెప్పించి సమస్యను పరిష్కరించి పాత్రికేయులకు నివేశన స్థలాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ తో పాటు కంచికచర్ల పాత్రికేయులు గంగిరెడ్డి రంగారావు, నన్నపనేని సాంబశివ రావు, బొక్కా ప్రభాకర్ రావు, కత్తి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
#ysrcp_nandigama
#mla_nandigama
#arun_kumar_monditoka
#jagan_mohan_rao_monditoka