Best Web Hosting Provider In India 2024

భూ సర్వేల కారణంగా గ్రామాల్లో తగాదాలు తగ్గుముఖం
పరిపాలన వికేంద్రీకరణతో సత్ఫలితాలు
రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: భూ సర్వేల గురించి నారా లోకేశ్‌కు ఏం తెలుసు అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఇక్కడ ఉండరని, హైదరాబాద్‌లో ఉంటారని, వారు విజయవాడ నగరంలో కానీ, విశాఖ నగరంలో కానీ శాశ్వత నివాసాలు ఏర్పరుచుకుని అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. భూ సర్వేల కారణంగా గ్రామాల్లో తగాదాలు తగ్గుముఖం పట్టాయని,శాంతి భద్రతల సమస్య అన్నది తలెత్తకుండా ఉందని అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ఏం మాట్లాడారంటే..
పరిపాలన వికేంద్రీకరణతో సత్ఫలితాలు వచ్చాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం మండలం,గూడెం గ్రామంలో 61.8 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం,ఆర్బికే భవనాలను రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గ్రామస్తులకు అవసరమైన కార్యాలయాలు ప్రారంభించడం సంతోషంగా ఉంది. మండల హెడ్ క్వార్టర్ కి వెళ్లకుండా అని గ్రామంలోనే అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఇది అంత నాలుగేళ్ల క్రితం ఏర్పడిన వైయస్సార్సీపీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయ్యింది. పరిపాలన వికేంద్రీకరణ తో ప్రజలకు అందుబాటులోకి అనేక సేవలు తీసుకు వచ్చాం.
గ్రామాల్లో తగాదాలకు కారణంగా నిలిచేది భూమి. భూమి హద్దులు తెలియక సొంత అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు జరిగేవి. హద్దులు సరిగ్గా నిర్ణయిద్దాం అని ఆ రోజు 100 ఏళ్ల క్రితం చేపట్టిన సర్వేనే ఇప్పటికీ ప్రామాణికంగా భావిస్తూ ఉన్నాం. అందుకే ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని భూ సర్వే చేపట్టాం. ఇక వీటిపై ముఖ్యంగా పాలనపై విపక్షాలు చెప్పే అబద్ధాలను నమ్మవద్దు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ హైదరాబాద్ లో ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉండరు, హైద్రాబాద్ లో ఉంటారు. తండ్రీ, కొడుకులిద్దరూ హైద్రాబాద్ లోనే ఉంటారు. విజయవాడలో కానీ విశాఖలో కానీ స్థిరమైన ఇల్లు ఉంచుకొని ఇక్కడ పరిస్థితు లపై మాట్లాడాలి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండే భూ సమస్యలపై లోకేశ్ కు ఏమయినా తెలుసా ? అన్నది నా ప్రశ్న. అసలు సర్వే అంటే ఏంటో తెలుసా లోకేశ్.. ? 14 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. గ్రామాల్లో ఉండే భూమి సమస్యలపై ఏనాడైనా దృష్టి పెట్టారా.. ? కానీ ఇవాళ సర్వే కోసం కానీ,పాస్ పుస్తకాలు పంపిణీ కోసం,హద్దు రాళ్ళు వేసేటప్పుడు కానీ ఏ ఒక్కరి దగ్గర పైసా కూడా అధికారులు కానీ,అధికార పార్టీ ప్రతినిధులు కానీ లంచాలు తీసుకున్న దాఖలాలు లేవు. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో అయితే ఏ పని అవ్వాలన్నా.. స్థానికంగా ఉండే జన్మ భూమి కమిటీ సభ్యులను ప్రాథేయపడితే కానీ పనులు అయ్యేవి కావు. నాటి జన్మభూమి కమిటీ సభ్యులు బ్రోకర్ల మాదిరిగా వ్యవహరించారు. వాళ్లకు డబ్బులు ఇస్తే,వాళ్లకు భోజనం పెట్టిస్తే,మందు ఇస్తే కానీ పనులు అయ్యేవి కావు. కానీ ఇవాళ గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరికీ ధీమా ఉంది.
ఈ రోజు ఇంత మంది స్త్రీలు సంతోషంగా ఉంటే ఈ ప్రభుత్వం చేసిన పనుల వల్లే కదా..! 75 ఏళ్ళ స్వతంత్ర భారతావనిలో వివిధ వర్గాల సంక్షేమార్థం ఆలోచన చేసిన ప్రభుత్వాలు పేద వారి కోసం ఏ ఒక్క ఆలోచనా అమలు చేయలేదు. 2019 లో ఎన్నికైన వైయస్సార్సీపీ ప్రభుత్వం ఒక్కటే పేదల కోసం,వారి స్థితి,గతులు పెంచాలి అని ఉద్దేశంతో పనిచేస్తోంది. ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పంట నష్టం వస్తే ఏనాడైనా స్పందించారా.. ? మొన్నటి వేళ మిగ్ జాం తుఫాను కారణంగా వర్షాలు వస్తే పొలం గట్టు మీద కి వెళ్లి దొంగ జపం చేస్తున్నారు ? ఈ ప్రభుత్వం హయాంలో ఇన్సురెన్స్,ఇన్పుట్ సబ్సిడీ అని వెంట వెంటనే అందిస్తున్నాం. వాటి చెల్లింపుల విషయమై ఆలస్యానికి తావు లేదు. పేదరికం అన్నది పిల్లల విద్యకు అడ్డు కాకూడదు అని, పెద్ద ఎత్తుగా విద్యకు నిధులు కేటాయిస్తున్నాం.
కానీ మన విపక్ష నేత చంద్రబాబుకు ఎన్నికల ముందే అని గుర్తుకు వస్తాయి. ఎన్నికల ముందే అంటే 2019 కి ముందు పెన్షన్ పెంచారు. కారణం వైయస్సార్సీపీ మ్యానిఫెస్టోలో పింఛన్ ను పెంచుతాం అని, 2000 రూపాయలు ఇస్తాం అని ప్రకటన చేశారు కనుక. అలానే మహిళా సంఘాలకు చంద్రబాబు మోసం చేస్తే, సీఎం వైయస్ జగన్ భరోసా ఇచ్చి,ఇప్పటికే మూడు దఫాలుగా బ్యాంకులకు చెల్లించారు. మాట తప్పే నైజం చంద్రబాబుకు ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి పరిస్థితులలో కూడా నిలబెట్టుకుంటారు వైయస్ జగన్. కానీ ఇవాళ చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలని అని తప్పుడు వార్తలతో,అబద్ధపు ప్రచారాలతో యెల్లో మీడియాలో చూపించే వార్తలను నమ్మ వద్దూ అని మంత్రి ప్రసాదరావు అన్నారు