







ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.17-9-2022(శనివారం) ..
నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ , జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ,జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ..
నందిగామ పట్టణంలోని పురాతన తహసిల్దార్ కార్యాలయాన్ని రూ.పది లక్షల అంచనా వ్యయంతో మరమ్మతులు చేసి అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటుచేసిన తహసిల్దార్ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం అధికారులు- ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని , ఇప్పటికే పట్టణంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు ప్రారంభించామని , నందిగామలో కేంద్రీయ విద్యాలయం ,ఇంటింటికి తాగునీటి కుళాయి పథకం , వంద పడకల ఆసుపత్రి మంజూరు , నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు -ఆసుపత్రులు -పురాతన ప్రభుత్వ భవనాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ,నందిగామలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాత ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆర్డీవో కార్యాలయానికి కేటాయించడం జరిగిందని , బ్రిటిష్ కాలం నాటి పురాతన కార్యాలయం శిథిలావస్థకు చేరకుండా , వారసత్వ సంపదగా ఆ భవనాన్ని కాపాడుకుంటూ దానికి మరమ్మత్తులు చేసి తహసిల్దార్ కార్యాలయానికి వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ,నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్న కలెక్టర్ ఢిల్లీ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్రావు ,ఎమ్మార్వో నరసింహారావు , జడ్పిటిసి గాదెల బాబు ,ఎంపీపీ సుందరమ్మ ,నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka