Best Web Hosting Provider In India 2024
18 Dec 2023 3:08 PM

జమ్మూ, కశ్మీర్ బిల్లుపై చర్చలో వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ : జమ్మూ, కశ్మీర్, పుదుచ్చేరి శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పాల్గొని మాట్లాడారు. డబుల్ మైనారిటీలైన ఎస్సీ, ఎస్టీ మహిళలతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సైతం ఆయా అసెంబ్లీలలో రిజర్వేషన్ కల్పించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ను విస్మరించడం తగదన్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోను బీసీ మహిళలకు స్థానం కల్పించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ బిల్లుకు ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు ప్రకటించారు.