Best Web Hosting Provider In India 2024

Salaar Release Trailer Views: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మరోసారి రుజువైంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంత నిరీక్షిస్తున్నారో తేటతెల్లమైంది. సలార్ సినిమా నుంచి నేడు (డిసెంబర్ 18) రెండో ట్రైలర్ వచ్చింది. యాక్షన్‌తో ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఉదయాన్నే రావాల్సిన ట్రైలర్.. వాయిదా తర్వాత మధ్యాహ్నం తెస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. అప్పుడు కూడా ఆలస్యం చేసి.. ఎట్టకేలకు రిలీజ్ చేసింది. అయితే, సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చీరాగానే వ్యూస్‌లో దూసుకెళ్లింది.
ట్రెండింగ్ వార్తలు
సలార్ నుంచి ఈ రిలీజ్ ట్రైలర్ నేటి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకు వచ్చింది. తెలుగు ట్రైలర్ ఆరంభం నుంచే దూసుకెళ్లింది. వ్యూస్‌లో కొత్త రికార్డులు సృష్టించేలా పరుగులు పెట్టింది. సలార్ రిలీజ్ తెలుగు ట్రైలర్‌కు సుమారు 26 నిమిషాల్లోనే మిలియన్ (10లక్షలు) వ్యూస్ దాటిపోయాయి. అరగంటే ముగియక ముందే మిలియన్ మార్క్ దాటి సత్తాచాటింది సలార్ కొత్త తెలుగు ట్రైలర్. క్రేజ్ అంటే ఇది కదా అనే రేంజ్లో దూసుకెళ్లింది.
సలార్ రిలీజ్ ట్రైలర్ అరగంటలోనే మిలియన్ వ్యూస్ మైలురాయి దాటగా.. మరిన్ని రికార్డులను కూడా సృష్టించే ఛాన్స్ అధికంగా ఉంది. హిందీలోనూ సలార్ ట్రైలర్ దూసుకెళుతోంది. తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ ట్రైలర్‌కు క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది.
సలార్ రిలీజ్ ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్సులు, డైలాగ్‌లు అదిరిపోయాయి. యాక్షన్ మోడ్‌లో ప్రభాస్‌ను చూడాలనుకుంటున్న అభిమానులకు సలార్ మూవీ పండగే అనేలా ఈ ట్రైలర్ ఉంది. అలాగే, ప్రభాస్ డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రభాస్‌ను సాయం కోసం తీసుకురావడం.. ఖాన్సార్‌లో అడుగుపెట్టి ప్రత్యర్థులను ప్రభాస్ ఖతం చేయడం చుట్టూ ట్రైలర్ సాగింది. ప్రత్యేకమైన మిషన్ గన్లు కూడా మరో హైలైట్‌గా ఉన్నాయి. హీరోయిన్ శృతి హాసన్ ఈ రెండో ట్రైలర్లో కూడా ఒక్క షాట్‌లోనే కనిపించారు.
సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. రవిబస్రూర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీయారెడ్డి, బాబి సింహా, ఈశ్వరి రావు, టిన్నూ ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 22వ తేదీన సలార్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
సంబంధిత కథనం
టాపిక్