




ఎన్టీఆర్ జిల్లా / నందిగామ (చందాపురం) ..
చందాపురం లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కలెక్టర్ ఢిల్లీ రావు ..
నందిగామ మండలంలోని చందాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శనివారం సాయంత్రం ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను , డాక్టర్ జగన్ మోహన్ రావు లతో కలిసి కలెక్టర్ ఢిల్లీ రావు ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు , ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ భవనాలు , విలేజ్ హెల్త్ క్లినిక్ లు , రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని ,ప్రభుత్వ నూతన భవనాల నిర్మాణంలో జిల్లాలోనే నందిగామ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని , అన్ని రకాల సేవలు ఆ గ్రామంలోనే ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది- వాలంటీర్లు పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ,
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్ర , ఎమ్మార్వో నరసింహారావు , గ్రామ సర్పంచ్ చిరుమామిళ్ల చందన కిరణ్ , ఎంపీపీ సుందరమ్మ, జడ్పిటిసి గాదెల బాబు , సీనియర్ నాయకులు కోవెలమూడి వెంకటనారాయణ ,శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka