YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.28-9-2022(బుధవారం) ..
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన ..
నందిగామ పట్టణంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మూడేళ్లలోనే నందిగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ది ..
నందిగామ పట్టణంలోని ఐదవ వార్డు పరిధిలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రారంభించి , ఆ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు , ముందుగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే చెల్లిందన్నారు ,కులం- మతం- పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ,రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని – ప్రభుత్వ పరిపాలన విధానాల్లో సమూల మార్పులు తెచ్చి – పేదల ఇళ్ల ముంగిటకే పాలన చేరువయ్యేలా చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదన్నారు ,
మూడేళ్లలోనే నందిగామ పట్టణాభివృద్ధి ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే నందిగామ పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేసి చూపించామని ,పట్టణ పరిధిలో రెండు అర్బన్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం ,ఓపెన్ జిమ్ ,కేంద్రీయ విద్యాలయం , సీఎం రోడ్డు విస్తరణ ,రూ.15 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం ,సిసి రోడ్ల నిర్మాణం ,ఇంటింటికి తాగునీటి కుళాయిలు ,2 వేల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు ,నాడు- నేడు కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లాంటి ఎన్నో పనులను కేవలం మూడేళ్లలోనే సాధించామని ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు తెలిపారు , రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించి -ముందుకు వెళ్తున్నామన్నారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్, కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు , సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..