
మొగల్తూరులోని కృష్ణంరాజు గారి సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఏర్పాటుచేసిన సినీ ప్రముఖులు దివంగత కృష్ణంరాజు గారి సంస్మరణ సభలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు , అనంతరం సినీ హీరో ప్రభాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు , కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలా దేవి గారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణ , పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు , పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా , చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు ..